Gas Saving Tips: దేశంలో గ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఉన్న సిలిండర్‌నే ఎక్కువ రోజులు వాడాల్సిన పరిస్థితి. బర్నర్ క్లీనింగ్, గిన్నెపై మూత పెట్టడం, బియ్యం-పప్పులు నానబెట్టడం లాంటి సింపుల్ ట్రిక్స్‌తో గ్యాస్‌ను ఎలా ఆదా చేయొచ్చో ఇక్కడ చూడండి.
దేశంలో గ్యాస్ కొరత భయం పట్టుకుంది. కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటే, మరికొందరు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. యుద్ధం కొనసాగితే కొరత తప్పదు. అందుకే ప్రభుత్వం కూడా గ్యాస్‌ను పొదుపుగా వాడాలని సూచిస్తోంది. అయితే ఈ 7 టిప్స్ పాటిస్తే గ్యాస్ ఆదా అవుతుంది.
27
బర్నర్ క్లీన్ చేయాలి
ముందుగా బర్నర్, పైప్, రెగ్యులేటర్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. బర్నర్ నుంచి మంట నీలం రంగులో వస్తే అంతా ఓకే. ఎరుపు రంగులో వస్తే సమస్య ఉన్నట్టే.
37
పొంగు రాగానే సిమ్‌లో పెట్టాలి
వంట చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి, ఒక పొంగు రాగానే సిమ్‌లోకి మార్చండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ చాలా ఆదా అవుతుంది.
కూరగాయలు, పప్పులు ఉడికించేటప్పుడు గిన్నెపై కచ్చితంగా మూత పెట్టండి. ఆవిరి బయటకు పోకుండా ఉండి, పదార్థాలు తొందరగా ఉడుకుతాయి.
57
వెడల్పాటి పాత్రలు వాడాలి
వంట కోసం వెడల్పుగా ఉండే అడుగు భాగం ఉన్న పాత్రలను వాడండి. దీనివల్ల మంట అన్ని వైపులా సమానంగా తగిలి, ఆహారం త్వరగా ఉడుకుతుంది.
67
బియ్యం-పప్పులు నానబెట్టాలి
అన్నం వండే ముందు బియ్యాన్ని, పప్పు వండే ముందు పప్పును కాసేపు నానబెట్టండి. ఇలా చేస్తే అవి చాలా తొందరగా ఉడికిపోయి గ్యాస్ ఆదా అవుతుంది.
77
చివరిగా ఈ జాగ్రత్తలు
గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి, స్టవ్ ఆఫ్ చేసే రెండు నిమిషాల ముందే ఆపినా పర్వాలేదు. ఆ వేడికి వంట పూర్తవుతుంది. ముఖ్యంగా, వంట చేస్తూ మొబైల్ చూడొద్దు. వంట పూర్తవగానే గ్యాస్ కట్టేయండి. ఇంట్లో అందరూ ఒకేసారి భోజనం చేస్తే, పదేపదే వేడి చేసే పని ఉండదు.