ఈ మధ్యకాలంలో చాలా మంది కామన్ గా ఫేస్ చేస్తున్న సమస్య పొట్ట. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు అంటూ... అందరివీ కూర్చొని చేసే పనులే. రోజులో 8 నుంచి 10 గంటలు కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం వల్ల యువతీ యువకుల్లో పొట్ట సమస్య వచ్చేస్తోంది. ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కూడా పొట్ట వస్తోందని, వచ్చిన పొట్ట తగ్గడం లేదని ఫీలౌతూ ఉంటారు.
అవును! సాధారణంగా కూర్చుని పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువ. భోజనం చేసిన తర్వాత కనీస వ్యాయామం శరీరానికి లేకుండా.. గంటల తరపడి కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని అనుకుంటూ ఉంటారు. అయితే... కూర్చొని పని చేసినా కూడా పొట్ట రాకూడదంటే ఏం చేయాలో, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
చలికాలంలో చిన్న పని చేయడానికే బద్దకం వస్తుంది ఇక వర్కౌట్, వాకింగ్ లాంటివి ఈ సీజన్ లో అసలే చేయలేం. ఈ సీజన్ లో ఎక్కువగా తినేసేయడం వల్ల కూడా లావుగా అవుతాం. కాబట్టి రోజుకి కనీసం 10 వేల అడుగులు నడవాలి, క్రమంగా ఆహారం తీసుకోవాలి.
అల్లం నీరు:
అల్లంలో ఉండే థర్మోజెనిక్ గుణాలు జీర్ణక్రియను పెంచుతాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే పొట్ట కరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరగడుపున తాగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
మిరియాలు:
పొట్ట తగ్గాలి అనుకునేవాళ్లు మిరియాలు కూడా తమ డైట్ లో తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మిరియాలలో పెప్పరైన్ అనేది మన జీవక్రియలను పెంచుతుంది.
చియా, అవిసె గింజలు
ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించేవారు, వ్యాయామం చేసేవారు తప్పకుండా చియా, అవిసె గింజలు తింటారు. వీటిలో ప్రోటీన్, ఒమెగా 3 ఎక్కువ. ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండినట్టు ఉంటుంది, తరచుగా ఆకలి వేయదు.
మెంతుల టీ, రాగు గంజి లేదా రాగు అంబలి, ఆపిల్ సైడర్ వెనిగర్, చక్కెర టీ, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే పనిచేసేవారు కొంతవరకు పొట్ట తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా.. ఎంత పని ఉన్నా.. మధ్యలో లేచి అడుగులు వేస్తూ ఉండాలి. లేదంటే.. పొట్ట మరింత పెరిగే అవకాశం ఉంటుంది.