ఏం చేస్తే.. ఇంట్లోకి చీమలు, దోమలు,ఈగలు, పురుగులు రాకుండా ఉంటాయో తెలుసా?

First Published | Nov 30, 2024, 12:57 PM IST

చలికాలంలో ఇంట్లోకి చీమలు, ఈగలు, పురుగులు వస్తూనే ఉంటాయి. వీటివల్ల మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇవి ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కాలాలతో సంబంధం లేకుండా ఇంట్లోకి చీమలు, ఈగలు, దోమలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వంటింట్లో ఎటు చూసినా ఇవి కనిపిస్తాయి. వీటివల్ల వంటింట్లో దుర్వాసన రావడమే కాకుండా.. మనకు అంటువ్యాధులొచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని వంటింట్లో నుంచి లేకుండా చేయడానికి ఎన్నో రకాల కెమికల్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ ఈ కెమికల్స్ మంచివి కావు. కాబట్టి సహజ పద్దతుల్లో వీటిని ఇంట్లోకి రాకుండా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వంటింట్లో నుంచి చీమలు, దోమలు లేకుండా చేయాలంటే ఏం చేయాలి

 ఇంట్లోని మిగతా గదులతో పోలిస్తే వంటింట్లోనే ఈగలు, చీమలు ఎక్కువగా ఉంటాయి. వీటి బెడద తగ్గాలంటే వంటింట్లోని కిటికీ దగ్గర పుదీనా ఆకులు, తులసి ఆకులు, నిమ్మకాయలను ఉంచండి.  వీటివల్ల ఈగలు,దోమలు, పురుగులు వంటింట్లోకి రావు. 

 వీటితో పాటుగా లావెండర్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ వంటి నూనెలను కిటికీల దగ్గర ఉంచినా..వాటి వాసనకు ఇంట్లోకి ఒక్క దోమ రాదు. ఈగ రాదు. 


వంటింట్లోకి చీమలు, ఈగలు రాకూడదంటే కిచెన్ ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటింటి సింక్ లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే పండ్లు, కూరగాయల తొక్కల్ని అలాగే కించెన్ లో ఉంచకుండా వాటిని ఒక ప్లాస్టిక్ కవర్‌లో వేసి మూసేసి డస్ట్ బిన్ లో వేయాలి.

సింక్ పైపు లీకేజీ కాకుండా చూసుకోవాలి

కిచెన్ లో సింక్ పైపు గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కానీ చాలా సార్లు ఈ పైపు పగిలి దాని నుంచి నీళ్లు లీకేజీ అవుతుంటాయి. దీనివల్ల కిచెన్ లో దుర్వాసన రావడమే కాకుండా మురికిగా కూడా మారుతుంది. అందుకే  కిచెన్ సింక్ పైపు నుంచి వాటర్ లీకేజీ అయితే వెంటనే రిపేర్ చేయించండి. అలాగే సింక్ ను కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి.

పండ్లపై మూయండి

మీరు తినడానికని పండ్లను ముక్కలుగా చేస్తే వాటిని అలాగే వదిలేయకుండా వాటిపై ఒక ప్లేట్ ను మూయండి. లేదంటే వాటిపై ఈగలు, దోమలు, వాలతాయి. అలాగే ఫుడ్ గిన్నెలను కూడా తెరిచి ఉంచకూడదు. ఈగలు వాలిన ఫుడ్ ను తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. 

సింక్ లో గిన్నెలను జమ చేయకూడదు

చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు తిన్న, వండిన గిన్నెలను సింక్ లో జమ చేస్తుంటారు. వీటన్నింటిని సాయంత్రం లేదా రాత్రిపూట తోముతుంటారు. కానీ ఈ అలవాటును వెంటనే మానుకోవాలి. ఎందుకంటే సింక్‌లో గిన్నెలు ఎక్కువసేపు ఉంటే దానివల్ల సింక్‌లో మురికి వాసన వస్తుంది. అందుకే గిన్నెలను ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉండాలి. 

Latest Videos

click me!