Kitchen Hack: అరటికాయ జిగురు చేతులకు అంటకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి
food-life May 08 2026
Author: Nandini Arava Image Credits:chatgpt
Telugu
నూనె రాయడం
అరటికాయలు కోయడానికి ముందే మీ అరచేతులకు, కోసే చాకుకు కొద్దిగా వంట నూనె రాసుకోండి. దీనివల్ల జిగురు చేతికి అంటుకోకుండా చేస్తుంది.
Image credits: stockPhoto
Telugu
ఉప్పు నీరు
ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేయండి. అరటికాయ ముక్కలను కోసిన వెంటనే ఈ నీటిలో వేయాలి. దీనివల్ల ముక్కలు నల్లబడవు, జిగురు వదులుతుంది.
Image credits: stockPhoto
Telugu
నిమ్మరసం చిట్కా
మీ చేతులకు నూనె రాసుకోవడం ఇష్టం లేకపోతే, అరటికాయ కోసే ముందు చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసుకోండి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ జిగురు లేకుండా చేస్తుంది.
Image credits: our own
Telugu
పాలు లేదా మజ్జిగ
అరటికాయ ముక్కలు కోసేటప్పుడు చేతులకు జిగురు అంటితే, కొద్దిగా పాలు లేదా పలచని మజ్జిగతో చేతులు కడుక్కోండి. జిగురు త్వరగా వదిలిపోతుంది.
Image credits: Istock photos
Telugu
పీలర్ కంటే కత్తి వాడితే బెటర్
చేతులకు జిగురు అంటుకుంటే నూనె వేసి రుద్ది, సబ్బుతో కడగండి. లేదా గోరువెచ్చని నీటిలో చేతులు ఉంచితే జిగురు వదులుతుంది. అరటి తొక్క తీసేటప్పుడు పీలర్ కంటే కత్తి వాడితే జిగురు అంటుకోదు.