టమాటాలను ఎక్కువగా తింటే కీళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలు, అలెర్జీ వంటి ఎన్నో రోగాలొస్తయ్ జాగ్రత్త..

First Published Jun 30, 2022, 1:57 PM IST

టమాటాలే లేని కూరలు ఉండవంటే నమ్మండి. టామాటాలు కూరలను టేస్టీగా చేస్తాయి. అందుకే వీటిని ప్రతి కూరలో వేస్తుంటారు. కానీ టమాటాలను ఎక్కువగా తినడం మీ పాణానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఏ కూర చేసినా అందులో తప్పకుండా టమాటా ఉండాల్సిందే అంటారు చాలా మంది. ఒకరకంగా చెప్పాలంటే టమాటాలు లేని కూరలు ఉండవేమో. ఎందుకంటే టమాటాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కూరలను టేస్టీగా చేస్తాయి కూడా. అందుకే వీటిని ప్రతి వంటకంలో ఉపయోగిస్తుంటాయి. టమాటాలు ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నా.. మితి మీరి తింటే మన ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టమాటాలను మితిమీరి తింటే మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. టమాటాలు మనపై ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకుందాం పదండి.. 

యాసిడ్ రిఫ్లక్స్ (Acid reflux): టమాటాలు ఆమ్ల స్వభావాన్ని కలిగుంటాయి. టమాటాలను ఎక్కువగా తింటే కడుపులో గ్యాస్ ఎక్కువగా ఏర్పడుతుంది. దీంతో గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుంది. మీరు జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టైతే టమాటాలను ఎక్కువగా తినకుండా జాగ్రత్త వహించండి. 

కిడ్నీ సంబంధిత సమస్యలు: టమోటాల్లో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారికి పొటాషియం అంత మంచిది కాదు. శరీరంలో పొటాషియం ఎక్కువైతే మూత్రపిండాల వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. అందుకే.. టమాటాలను తక్కువ మొత్తంలోనే తినాలి. 

కీళ్ల నొప్పులు (Arthritis): టమోటాలను ఎక్కువగా తినడం వల్ల కీళ్లలో వాపు, నొప్పి వంటి సమస్యలు వస్తాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే వీటిలో సోలనైన్ అని పిలువబడే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఈ సోలనైన్ కణజాలాలలో కాల్షియం నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాస్త ఎక్కువైతే.. కీళ్లలో మంట, నొప్పికి దారితీస్తుంది.
 

అలర్జీలు, ఇన్ఫెక్షన్లు (Allergies, Infections): టమోటాల్లో హిస్టామిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వంటి సమస్యలకు కారణమవుతుంది. అందుకే మీకు టమాటాల అలెర్జీ ఉంటే వీటిని తినడం మానుకోండి. ఒకవేళ తింటే నోరు, నాలుక, ముఖం వాపు వస్తుంది. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ సమస్య కూడా మొదలవుతుంది. తుమ్ములు కూడా వస్తాయి.
 

లైకోపెనోడెర్మియా సమస్య (Lycopenoderma problem): డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు టమోటాల ప్రయోజనాలను చెప్పడంతో పాటుగా వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను సైతం వివరిస్తున్నారు. టమోటాలను మోతాదుకు మించి తినడం వల్ల   lycopenodermia కు దారితీస్తుంది. ఇది రక్తంలో అధిక లైకోపీన్ వల్ల కలిగే పరిస్థితి. 

టమోటాల్లో లైకోపీన్ కంటెంట్ ఉంటుంది:  లైకోపీన్ మన శరీరానికి ఎంతో మంచి చేస్తుంది.  కానీ గర్భధారణ సమయంలో లైకోపీన్ సప్లిమెంట్లను తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలను తీవ్రతరం చేయడంలో లైకోపీన్ ముందుంటుంది. ఉదర  సమస్యలు, కడుపు పూత వంట రోగాలున్న వారికి లైకోపీన్ మంచిది కాదు. ఇదది లో బీపీకి దారితీస్తుంది. 

click me!