Hair Care Tips: వర్షాకాలంలో మీ జుట్టు బాగుండాలంటే ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే మరి..!

Published : Jun 30, 2022, 12:48 PM ISTUpdated : Jun 30, 2022, 12:50 PM IST

మిగతా కాలాలతో పోల్చితే వర్షాకాలంలోనే జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యలు రాకూడదంటే జుట్టుకోసం కొన్ని టిప్స్ ను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే..  

PREV
19
Hair Care Tips: వర్షాకాలంలో మీ జుట్టు బాగుండాలంటే ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే మరి..!

వర్షాకాలం ఎంట్రీ ఇచ్చేసింది. చిరుజల్లులతో ఎటూ చూసినా.. పచ్చదనమే కనిపిస్తుంది. ఈ సీజన్ ఎంత అందంగా ఉంటుందో.. అంతకు మించి ఎక్కువ ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఎందుకంటే ఈ వానాకాలంలో ఇన్ఫెక్షన్ష్, వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాదు చర్మం, వెంట్రుకల  సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. 

29

ఈ కాలంలో జుట్టు జిగటగా మారుతుంది. అలాగే జుట్ఠు రాలిపోవడం, చిట్లిపోవడం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలు ఈకాలంలో సర్వసాధారణం ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో జుట్టు పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

39

వర్షంలో తడవడం వల్ల జుట్టు నెత్తికి అతుక్కుపోతుంది. దీంతో జుట్టుట్టు రాలడంతో పాటుగా నెత్తిపై మురికి పేరుకుపోతుంది. దీనివల్ల వెంట్రుకలు పగిలిపోతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ సమయంలో నెత్తిమీద బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. Fungal infection ప్రమాదం పెరుతుంది కూడా. 

49

వర్షాకాలంలో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందుగా మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని వర్షపు నీటిలో మీ జుట్టు తడిసిపోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ నీరు ఆమ్లంగా ఉంటుంది. ఇది మీ తల చర్మాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వర్షం నీటిలో తడిసిపోకండా ఎప్పుడూ మీతో గొడుగును తీసుకెళ్లండి. 
 

59

ఈ సీజన్ లో వారానికి కనీసం మూడుసార్లైన తలస్నానం చేయండి. మెడికేటెడ్ లేదా యాంటీ ఫంగల్ షాంపూను ను మాత్రమే మీ జుట్టుకు ఉపయోగించండి. జుట్టును కడిగిన తరువాత జుట్టును పూర్తిగా ఆరబెట్టండి. ఎందుకంటే తడి జుట్టే ఇన్ఫెక్షన్ కు ఎక్కువగా గురవుతుంది.

69

కాలాలతో సంబంధం లేకుండా జుట్టును కండీషన్ చేయడం మర్చిపోకూడదు. ఇది మీ జుట్టును స్మూత్ గా, సిల్కీగా మార్చుతుంది. అలాగే జుట్టుకు ఒక రకమైన రక్షణను కలిగిస్తుంది. దీనికోసం మీరు ఏదైనా హెర్బల్ లేదా సల్ఫేట్ ఫ్రీ కండీషనర్ ని ఉపయోగించవచ్చు.

79

వీటితో పాటుగా ఈ సీజన్ లో వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయండి. చేయాలి. దీనివల్ల నెత్తిమీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు రాలడాన్ని నిరోధిస్తుంది. 

89

జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే బయటి సంరక్షణ చర్యలతో పాటుగా.. బలమైన ఆహారం తీసుకోవాలి. ఆహారంలోనే మీ జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. దీంతోనే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఇందుకోసం మీరు ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలను, గుడ్లను, పాల ఉత్పత్తులను, వాల్ నట్స్, బాదం వంటి ఆహారాలను రోజూ తినాలి.

99

వారానికి ఒక రోజు హెయిర్ మాస్క్ ను వేసుకున్నా మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, అలోవెరా జెల్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది మీ జుట్టును దృఢంగా, మృదువుగా, సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories