చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ను తినడం మంచిదేనా?

First Published Nov 29, 2022, 2:46 PM IST

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తింటుంటారు. అయితే చలికాలంలో డ్రై ఫ్రూట్స్ అతిగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 
 

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే చాలా మంది ప్రతి సీజన్ లో డ్రై ఫ్రైట్స్ ను ఎక్కువగా తింటుంటారు. బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాలు మొదలైన డ్రై ఫ్రూట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా.. వీటిని చలికాలంలో తినడం ఆరోగ్యానికి మంచిదో? కాదో ? తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది. 

ఎన్ని డ్రై ఫ్రూట్స్ తినడం సురక్షితం?

ఆరోగ్యం బాగుండాలని కొంతమంది ఎక్కువ మొత్తంలో డ్రై ఫ్రూట్స్ ను తింటుంటారు. కానీ ఈ అలవాటు అంత మంచిది కాదు. ఎండుద్రాక్ష, అత్తి పండ్లు మొదలైన డ్రై ఫ్రూట్స్ ను రోజూ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాదం, వాల్ నట్స్ గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అరేకా గింజలను ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్, ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్, అపోలిపోప్రొటీన్ బి, ట్రైగ్లిజరైడ్ లు తగ్గుతాయి. 
 

పచ్చి డ్రై ఫ్రూట్స్ ను వేయించి తింటే ఇంకా మంచిది

బాదం, జీడిపప్పు వంటి కొన్ని విత్తనాలలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో కాల్షియం, ఆక్సలేట్ లు పేరుకుపోయి రాళ్ళు ఏర్పడతాయి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను పచ్చిగా కాకుండా వేయించి తింటే రిస్క్ తగ్గుతుంది. ఈ విత్తనాలను కొంత పెరుగుతో కలిపి తినడం ఇంకా మంచిదంటున్నారు నిపుణులు. ఏదేమైనా వీటిని తక్కువగా తినడమే ఆరోగ్యానికి మంచిది.  

కొన్ని డ్రై ఫ్రూట్స్ వేరే వాటి కన్నా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం, వాల్ నట్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు ఒక బ్రెజిల్ గింజ తినడం వల్ల సెలీనియం అందుతుంది. ఇది థైరాయిడ్ తో బాధపడేవారికి చాలా మంచిది.

డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయించకూడదు. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. వీటిని రిఫ్రిజిరేటర్ లేదా ఫ్రీజర్ వంటి చల్లని ప్రదేశంలో నిల్వచేయండి కానీ.. ఎక్కువగా వేయించకండి. కాల్చిన విత్తనాలలో ఉండే పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఆక్సీకరణకు ఎక్కువగా గురవుతాయి. విత్తనాలను కాల్చాలనుకుంటే.. తక్కువ ఉష్ణోగ్రత వద్ద వేయించండి. 

మొత్తం మీద ఎండిన పండ్లు.. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కు మంచి మూలం. కానీ వీటిలో ఉండే విటమిన్ సి వంటి నీటిలో కరిగే చాలా విటమిన్లు క్షీణిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ను తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.    

click me!