టీవీ, ల్యాప్ టాప్ లను ఆన్ చేసి నిద్రపోయే అలవాటుందా? ఈ డేంజర్ రోగాలొస్తయ్ జాగ్రత్త..

First Published Nov 29, 2022, 1:56 PM IST

ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లను విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు టీవీ, ల్యాప్ ప్యాట్, ఫోన్ లను ఆన్ చేసి పడుకుంటుంటారు. కానీ దీనివల్ల ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఒక్కొక్కరూ ఒక్కోలా నిద్రపోతుంటారు. కొందరు వెళుతురులోనే నిద్రపోతే.. మరికొంతమంది చికట్లోనే నిద్రపోతారు. ఇక కొంతమంది చలికాలంలో కూడా ఫ్యాన్ వేసుకుని నిద్రపోతారు. ఇకఅసలు విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో చాలా మంది టీవీలను, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ లను చూస్తూ చూస్తూ అలాగే పడుకోవడం అలవాటైపోయింది. ఒక జాతీయ సర్వే ప్రకారం.. 61 శాతం మంది అమెరికన్లు రాత్రిపూట టీవీలను ఆన్ లో ఉంచి పడుకోవడం అలవాటు చేసుకున్నారట.  నేషనల్ స్లీప్ ఫౌండేషన్, జర్నల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్ సంయుక్త అధ్యయనం ప్రకారం.. ప్రతి తొమ్మిది 9 మందిలో ఒకరు పడుకునే ముందు ఏదో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. 

టీవీ లేదా ల్యాప్ టాప్ ఆన్ చేసి పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ పడుకునేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రాంణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Latest Videos


జామా ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురించబడిన 2019 అధ్యయనం ప్రకారం..  బెడ్ రూంలో టీవీని ఆన్ చేసి పడుకోవడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే ఊబకాయం బారిన పడే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఈ అధ్యయనం కోసం 43,000 మందికి పైగా మహిళల నుంచి పరిశోధకులు డేటాను విశ్లేషించారు. టీవీ నుంచి వెలువడే నీలి కిరణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే.

కాంతి కళ్ళను దెబ్బతీస్తుంది

టీవీ, ల్యాప్ టాప్ ల నుంచి వెలువడే అధిక శక్తి బ్లూరే రెటీనాను దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కాంతి ఎక్కువ సేపు కళ్లపై పడటం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది. 

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

టీవీ, ల్యాప్ ల నుంచి వచ్చే నీలిరంగు కాంతి ప్రమాదకరమైన క్యాన్సర్ కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. రాత్రిపూట టీవీ లేదా ల్యాప్ టాప్ ను ఉపయోగించేవారికి లేదా వీటిని ఆన్ చేసి నిద్రపోయేవారికి రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది.
 

మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది

రాత్రిపూట ఎక్కువసేపు ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఉపయోగించే వ్యక్తులు ఇతర వ్యక్తుల కంటే ఎక్కువ నిరాశకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధన వెల్లడించింది. ఎందుకంటే వీటి నుంచి వెలువడే కాంతి పడుకున్న తర్వాత కూడా మీ మెదడును అలర్ట్ మోడ్ లో ఉంచుతుంది. దీనివల్ల మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు. దీంతో బాగా అలసిపోతారు. ఈ అలసట ఒత్తిడిని పెంచుతుంది. 
 

skin care

చర్మానికి నష్టం

అధిక శక్తి కలిగిన బ్లూ లైట్ వల్ల డిఎన్ఎ దెబ్బతింటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కణాలు, కణజాలాలు నాశనం కాకుండా.. చర్మం దెబ్బతినే ప్రమాదం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. రాత్రిపూట టీవీ, ల్యాప్ టాప్ ను ఆన్ చేసి పడుకోవడం మంచిది కాదు.   

click me!