కొబ్బరి నీళ్లను రోజూ తాగుతున్నారా.. ఇదెంత డేంజరో తెలుసా?

First Published Feb 3, 2023, 12:32 PM IST

నిజానికి కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిని తాగితే  శరీరం హైడ్రైట్ గా ఉంటుంది. చర్మం అందంగా మెరిసిపోతుంది. కానీ రోజూ కొబ్బరి నీళ్లను తాగడం మాత్రం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి నీళ్లు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ రుచికరమైన నేచురల్ డ్రింక్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎలక్ట్రోలైట్లను పెంచడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే కొంతమంది బాడీ హైడ్రేట్ గా ఉండటానికి, చర్మం అందంగా మెరిసిపోవడానికి రెగ్యులర్ గా కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. దీన్ని చాలా మంది మంచి అలవాటుగా భావిస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతిరోజూ కొబ్బరి నీళ్లను తాగితే మీ శరీరంలో హానికరమైన కొన్ని మూలకాలు పెరుగుతాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు మన శరీరంలో పొటాషియం స్థాయిలను బాగా పెంచుతాయి. ఇది కడుపు సమస్యలతో పాటుగా ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

తక్కువ రక్తపోటు

కొబ్బరి నీళ్లు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అలా రోజూ తాగితే మాత్రం మీ రక్తపోటు బాగా తగ్గిపోతుంది. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో పొటాషియం కంటంట్ ఉంటుంది. ఈ నీళ్లను రోజూ తాగడం వల్ల రక్తపోటు అకస్మాత్తుగా తగ్గుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. అందుకే పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను మరీ ఎక్కువగా తీసుకోకండి. 

విరేచనాలు

కొబ్బరి నీళ్లు కూడా విరేచనాలకు దారితీస్తాయి. కొబ్బరి నీళ్లలో పులియబెట్టిన ఒలిగోసాకరైడ్లు, డైసాకరైడ్లు, మోనోశాకరైడ్లు, పాలియోల్స్ (ఎఫ్ఓడిఎంఎపి) ఉంటాయి. ఇవి ప్రేగుల నుంచి నీటిని తీసుకునే చిన్న-గొలుసు కార్బోహైడ్రేట్లు. ఇది చాలా మందిలో విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. 

మధుమేహానికి మంచిది కాదు

డయాబెటిస్ పేషెంట్లు ఉన్నవారికి కొబ్బరి నీరు అంత మంచిది కాదు. వాస్తవానికి దీనిలో ఉండే అధిక కేలరీలు, చక్కెర స్థాయిలు డయాబెటీస్ సమస్యను ఎక్కువ చేస్తాయి. కొబ్బరి నీళ్లను తాగినప్పుడు రక్తంలో చక్కెర స్పైక్ వేగంగా జరుగుతుంది. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే..  వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే కొబ్బరి నీళ్లను తాగడం మంచిది. అది కూడా లిమిట్ లోనే.
 

coconut water

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత

కొబ్బరి నీటిలో పొటాషియం, సోడియం, మాంగనీస్ వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. మార్కెట్లో కొనే వివిధ కొబ్బరికాయలలో దీని పరిమాణం భిన్నంగా ఉంటుంది. అందుకే వీటిని ప్రతిరోజూ తాగడం వల్ల  శరీరంలోని ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత సమస్య వస్తుంది. ఇది శరీరానికి హానికరం. పొటాషియం స్థాయి పెరిగిపోతే పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

click me!