శృతిహాసన్ లా నిగారించే చర్మం కావాలా? ఈ హోమ్ మేడ్ స్క్రబ్ ట్రై చేయండి...

First Published Oct 18, 2021, 1:57 PM IST

మూడుపదులు దాటినా శృతిహాసన్ అందంగా మెరిసిపోతుంది. తన వయసు కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. యవ్వనవంతమైన చర్మానికి ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటుంది. చందమామలాంటి ముఖారవిందానికి ఆమె వాడే ఫేస్ స్క్రబ్ సీక్రెట్ ఒకసారి రివీల్ చేశారు.

శృతి హాసన్.. విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమారంగంలోకి ప్రవేశించి.. తన అందంతో, నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది శృతి హాసన్. గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుని.. సినిమాలో కనిపిస్తే చాలు హిట్ అనే సెంటిమెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. 

అందానికి, అభినయానికి పెట్టింది పేరైన శృతిహాసన్ మొదట్లో ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ గా పేరుండేది. తను నటించిన సినిమా హిట్ కాకపోవడమే దీనికి కారణం. అయితే దీంతో ఆమె కృంగి పోలేదు. ఆ విమర్శల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయింది. పవన్ కల్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో శృతిహాసన్ లైఫ్ ఛేంజ్ అయ్యింది. ఆ తరువాత ఆమె నటించిన ప్రతీ సినిమా హిట్టు బాటే పట్టడంతో ఆమెకు గోల్డెన్ లెగ్ అనే పేరొచ్చింది.

మూడుపదులు దాటినా శృతిహాసన్ అందంగా మెరిసిపోతుంది. తన వయసు కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. యవ్వనవంతమైన చర్మానికి ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకుంటుంది. చందమామలాంటి ముఖారవిందానికి ఆమె వాడే ఫేస్ స్క్రబ్ సీక్రెట్ ఒకసారి రివీల్ చేశారు.

సహజసౌందర్య రాశి అయిన శృతిహాసన్ తన అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ ను తయారు చేసుకుంటుంది. ఈ విషయాన్ని ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్ చెప్పుకొచ్చారు. 

దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం కొబ్బరి నూనె, బేకింగ్ సోడా కావాలని చెబుతోంది. కొబ్బరినూనెను, బేకింగ్ సోడాతో కలిపి face scrubగా వాడుతుందట. కొబ్బరినూనె సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తే, బేకింగ్ సోడాలో అద్భుతమైన ఎక్స్ పోలియేటింగ్ లక్షణాలు ఉన్నాయి. 

=

 కొబ్బరినూనెను ఫేస్ స్క్రబ్ గానే కాదు. జుట్టు రక్షణకూ శృతిహాసన్ వాడుతుందట. దీంతో జుట్టు అందంగా, నిగనిగలాడుతూ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి కొబ్బరినూనె సుగుణాలతో శృతి మెరిసిపోతుందట.. సో మీరు ట్రై చేయండి. 

click me!