మీరు పెళ్లి చేసుకునే వ్యక్తుల్లో ఈ లక్షణాలుంటే.. డేంజరే..

First Published Oct 18, 2021, 12:52 PM IST

అన్నీ బాగున్నాయి...సరైనవారే అని నిర్ణయానికి వచ్చిన వ్యక్తిలో లోపాలను కనిపెట్టడం ఎలా? మీకు సరైనవారో కాదో తెలిపే లక్షణాలు ఏంటీ అంటే... ఐదు రకాల లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని చెబుతున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. మరి అవేంటో చూడండి....

మనిషికి ఇష్టపడడం, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, జీవితకాలం కలిసి నడవాలనుకోవడం మామూలే. మంచిది కూడా. అయితే మీరు ఇష్టపడ్డ వ్యక్తి, మనసిచ్చిన వ్యక్తి మీకు తగినవాడేనా? అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి విషయాల మీద ముందుగా అవగాహన ఉండడం వల్ల జీవితం సాఫీగా సాగుతుంది. 

ఇది నిజమే...అయితే, అన్నీ బాగున్నాయి...సరైనవారే అని నిర్ణయానికి వచ్చిన వ్యక్తిలో లోపాలను కనిపెట్టడం ఎలా? మీకు సరైనవారో కాదో తెలిపే లక్షణాలు ఏంటీ అంటే... ఐదు రకాల లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని చెబుతున్నారు రిలేషన్ షిప్ నిపుణులు. మరి అవేంటో చూడండి....

దగాకోరు : ప్రేమలో అబద్ధాలు చెప్పడం మామూలే. ఇక తమ ప్రేమ నలుగురికీ తెలిసి ఇబ్బందులు ఎదురవుతాయని అప్పుడప్పుడూ ప్రేమికులు రహస్యాన్ని పాటిస్తుంటారు. అయితే మీ దగ్గర కూడా రహస్యంగా ఉంటున్నట్లైతే అలాంటి Liarsను నమ్మొద్దు. మీతో పరిచయం, ప్రేమను, మిమ్మల్ని రహస్యంగా మాత్రమే ఉంచాలనుకునేవారిని అంతగా నమ్మొద్దు. అంతేకాదు తాము చెప్పే అబద్ధాలే నిజమని నమ్ముతుంటారు. దీనివల్ల మొదట్లో బాగానే ఉన్నా..చివరికి మీకు బాధే మిగులుతుంది. 

హిపోక్రైట్స్ : కొంతమంది చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉంటుంది. అంటే మాటలకు, చేతలకు పొంతన ఉండదు. ఇలాంటి వారు జీవితంలో ఇబ్బందులు చాలా పడాల్సి వస్తుంది. పెళ్లి అనేది మామూలు విషయం కాదు.. జీవితకాలపు బంధం.. అందుకే ఇలాంటి వారిని వివాహం చేసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ముఖ్యంగా చేసుకోకుండా ఉండగలిగితే బెటర్. 

ఎప్పుడూ బాధితులుగా కనిపిస్తుంటారు.. కొంతమంది ఎప్పుడూ తమకు ఎవరో అన్యాయం చేశారని, తమను ఎవరో బాధపెట్టారని బాధపడుతూ ఉంటారు. వీరిని ఒక్కసారి ఎవరైనా బాధపెడితే జీవితకాలం మరిచిపోరు. సాధిస్తూ ఉంటారు. అంతేకాదు, తమ తప్పులు వేరేవాళ్లమీద రుద్దుతుంటారు. అదంతా వాళ్ల వళ్లే జరిగిందంటూ సాధిస్తుంటారు. ఇలాంటి వారితో జీవితం నిత్య నరకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. 

నేను, నాది, నేనే : ఏ విషయంలోనైనా నేను, నాది.. అన్నీ నేనే ఇలాంటి సెల్ఫిష్ భావన ఉన్నవారితో వేగడం చాలా కష్టం. ప్రపంచమంతా తన చుట్టే తిరుగుతుందని, తనే గొప్ప అని... తనదే రైట్ అని నమ్ముతారు. ఎదుటివారిని అస్సలు పట్టించుకోరు. వాళ్లు చేసేది ఏదైనా తప్పు కాదనే భావనలో ఉంటారు. దీనివల్ల ఇబ్బందులే తప్ప ప్రశాంతత ఉండదు. 

దేనిమీదా ఖచ్చితత్వం లేకపోవడం : వీరికి ఒక దానిమీద సరైన అవగాహన, నిర్ణయం ఉండదు.. దీనివల్ల మీ భావోద్వేగాల మీద సరైన అవగాహన ఉండదు. పట్టించుకోరు. మీ మీద ఎప్పుడూ అనుమానం ఉంటుంది. విశ్వాసం ఉండదు. ఎప్పుడూ మిమ్మల్ని గార్డ్ చేస్తున్నట్టు ఉంటారు. మీ మంచికోసం ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది. 

click me!