కోవిడ్ నుంచి కోలుకున్నాకా పురుషుల్లో ఈ లైంగిక సమస్యలు వస్తయ్..

First Published Nov 24, 2022, 2:07 PM IST

కరోనా మహమ్మారి మనుషులను శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. నరాలు దెబ్బతినడం, మూర్చ, ఆందోళన, మెదడు పనితీరును తగ్గేలా చేస్తుంది.
 

కరోనా మొత్తం ప్రపంచ దేశాలను తలకిందులుగా చేసింది. దీని మూలంగా ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ముఖ్యంగా మనుషుల ఆరోగ్యాన్ని కూడా ఇది ఎన్నో విధాలుగా ప్రభావితం చేసింది. కరోనా సోకడం వల్ల నరాలు దెబ్బతినడం, ఆందోళన, మూర్చ, మెదడు పనితీరు తగ్గడం మొదలైన సమస్యలు వస్తాయి. కరోనా వైరస్ గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసింది. దీనివల్ల ఎంతో మంది గుండెపోటు బారిన పడ్డారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.  అయితే కోవిడ్ తగ్గిన తర్వాత చాలా మంది పురుషులు లైంగిక సంబంధమైన సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అవేంటంటే.. 
 

కోవిడ్, లైంగిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏంటి

కోవిడ్ 19 తో ఎన్నో అనారోగ్య సమస్యలతో ముడి పడి ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ నుంచి కోలుకున్న పురుషుల్లో అంగస్తంభన పనిచేయకపోవడం సమస్యను ఫేస్ చేస్తున్నారట. ఈ అంగస్తంభనకు ప్రధాన కారణం మానసిక ఆరోగ్యం. అయితే కరోనా వచ్చిన వాళ్లు బాగా అలసిపోతారు. అలాగే నిరాశకు కూడా గురవుతారు. ఈ సమస్యల వల్ల అంగస్తంభన సమస్యను ఫేస్ చేస్తారట. 

కోవిడ్ ఇంద్రియ నరాలపై ప్రభావం చూపుతుందా? 

మరొక సిద్దాంతం ప్రకారం.. కోవిడ్ 19 టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది అంగస్తంభన లోపానికి కారణమవుతుంది. కోవిడ్ నేరుగా నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కూడా లైంగిక సమస్యలు వస్తాయి. 
 

erectile dysfunction

కోవిడ్, అంగస్తంభన పనిచేయకపోవడం మధ్య సంబంధం

పలు నివేదికల ప్రకారం.. ఎండోథెలియమ్ లో వైరస్ కణాలను గుర్తిస్తారు. ఇది గుండె, రక్తనాళాల లోపల ఉంటుంది. అయితే కోవిడ్ 19 ఎండోథెలియల్ పనిచేయకపోవడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కాస్త అంగస్తంభన లోపానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

వృద్ధులకు ఎక్కువ ప్రమాదం ఉంది   

ఏదేమైన వృద్ధులకే అంగస్తంభన లోపం ఎక్కువగా ఉంటుందని సర్వేలు చెబుతున్నారు. వృద్ధ పురుషుల్లో పలు అంతర్లీన సమస్యల వల్ల అంగస్తంభన లోపం వస్తుందట. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వృద్ధులకు అంగస్తంభన లోపం వచ్చే ప్రమాదం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. నిజానికి టెస్టోస్టెరాన్ స్థాయిలు వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతాయి. అయితే సాధారణ అంగస్తంభన పనితీరుకు టెస్టోస్టెరాన్ చాలా అవసరం. 
 

click me!