ఈ అలవాట్లుంటే పైల్స్ వస్తయ్ జాగ్రత్త..

First Published Nov 24, 2022, 12:43 PM IST

పైల్స్ బాధ వర్ణణాతీతం.. కానీ నేడు ఎంతో మంది అర్షమొలల సమస్యతో  ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ అర్షమొలలు కొన్ని అలవాట్ల వల్ల కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

పైల్స్ గురించి తెలియని వారుండరు. ఇవి మలద్వారం లోపల అవుతాయి. రక్తనాళాల వాపునే మొలలు అంటారు. ఇవి బయటకు కూడా వస్తాయి. రక్తనాళాల్లో పీడనం పెరగడం వల్ల మొలలు ఏర్పడతాయి. మలవిసర్జన సరిగ్గా లేకపోవడం, మలవిసర్జన, మూత్రవిసర్జన సమయంలో ఒత్తిడి పెంచడం  వల్ల ఇవి అవుతాయి. ఈ సమస్య అన్ని వయసుల వారికి రావొచ్చు. ఆడ, మగ అంటూ తేడా లేకుండా. మొలలు ఏర్పడటం వల్ల విపరమైన నొప్పి, దురద, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

పైల్స్ కు కారణమయ్యే రోజువారి అలవాట్లు

ఎక్కువ బరువులను ఎత్తడం, వేడి, కారంగా ఉండే ఆహారాలను తినడం, ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినడం, ఊబకాయం, ఎక్కువ సేపు ఒకే దగ్గర కూర్చోవడం, మలవిసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి తేవడం వంటివి పైల్స్ కు కారణమవుతాయి. 

piles

అయితే పైల్స్ ను తగ్గించడంలో ఆహారం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఫైబర్స్, ఆకుపచ్చకూరగాయలు, పండ్లు, నీటిని తక్కువగా తీసుకోవడం వల్లే పైల్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైట్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వల్ల కూడా పైల్స్ వస్తాయి. ఇలాంటి ఆహారాల వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేయదు. నీటిని తక్కువగా తాగడం వల్ల  మలబద్దకం సమస్య వస్తుంది. 

కాఫీ కూడా పైల్స్ రావడానికి మరొక కారణం. ఎందుకంటే కాఫీని ఎక్కువగా తాగడం వల్ల పేగుకదలికలు నెమ్మదిస్తాయి. ఇక ఇప్పటికే పైల్స్ ఉంటే అవి మరింత పెరిగే అవకాశం ఉంది. మలబద్దకం, దీర్ఘకాలిక పేగు కదలికలతో బాధపడేవారు పైల్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. 

పైల్స్ తో బాధపడేవారు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలంటే.. 

పైల్స్ సమస్యతో బాధపడేవారు సమతుల్య ఆహారం తీసుకోవాలి.  కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ఫైబరర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే నీటిని పుష్కలంగా తాగాలి. 
 

పైల్స్ ట్రీట్ మెంట్ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం

పైల్స్ తో బాధపడుతున్న వాళ్లు చిక్కుళ్లను ఎక్కువగా తినాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి చాలా సులువుగా జీర్ణమవుతాయి. పైల్స్ వల్ల ఏర్పడే చికాకు, వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ వంటి తృణధాన్యాలు కూడా పైల్స్ ను నియంత్రించడానికి సహాయపడతాయి. వీళ్లు స్పైసీ ఫుడ్స్ ను అసలే తీసుకోకూడదు. బ్రోకలీ, చిలగడదుంపలు, టర్నిప్స్, క్యారెట్లు కూడా వీళ్ల ఆరోగ్యానికి మంచివి. 

piles

పైల్స్ చికిత్స

అయితే చాలా మంది పైల్స్ ను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలనే ఫాలో అవుతుంటారు. కానీ ఇంటి నివారణలు శాశ్వత ఉపశమనాన్ని అందించవు. ఇవి కేవలం పైల్స్ తీవ్రతను మాత్రమే తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే పైల్స్ వల్ల కలిగే నొప్పిని, అసౌకర్యాన్ని తాత్కాలికంగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

లేజర్ శస్త్రచికిత్స త్వరగా తగ్గిస్తుందా? 

లేజర్లు వంటి అధునాత శస్త్రచికిత్స పద్దతుల్లో పైల్స్ ను ఒక్క రోజులో నయం చేయొచ్చంటున్నారు నిపుణులు, లేజర్ శస్త్రచికిత్స సహాయంతో పైల్స్ ను తొలగించడానికి ఒకప్పుడు కొన్ని గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు 15 నుంచి 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ శస్త్రచికిత్స పూర్తైన తర్వాత ఇంటికి అదే రోజు వెళ్లొచ్చు. 
 

click me!