డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఈ ఏడు పండ్లను ఖచ్చితంగా తినండి..

First Published | Nov 24, 2022, 11:48 AM IST

డెంగ్యూ జ్వరం శరీరాన్ని చాలా బలహీనపరుస్తుంది. ఈ రోగాన్ని లైట్ తీసుకుంటే ప్రాణాలు పోయినా పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లే. అందుకే ఈ డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అయితే కొన్ని పండ్లు డెంగ్యూను త్వరగా తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

dengue

డెంగ్యూ ప్రాణాంతక రోగం. ఇది దోమకాటుతో వస్తుంది. ఈ రోగం వల్ల శరీరంలో పూర్తిగా బలహీనంగా మారుతుంది. వీళ్లను సరిగ్గా పట్టించుకోకపోతే ప్రాణాలు కూడా పోవచ్చు.  వీళ్లు దీనినుంచి త్వరగా బయటపడాలన్నా.. తొందరగా రికవరీ కావాలన్నా ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. డెంగ్యూ పేషెంట్లు చికిత్సకు బాగా రెస్పాండ్ కావడానికి, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఎక్కువ మొత్తంలో విటమిన్లు, పోషకాలు ఉండే బలవర్ధకమైన  ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూ పేషెంట్లు త్వరగా కోలుకోవాలంటే విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బాడీ హైడ్రేట్ గా ఉండటానికి ద్రవాలను ఎక్కువగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. వీళ్లు తిరిగి బలంగా అయ్యేందుకు కొన్ని రకాల పండ్లు బాగా సహాయపడతాయి. అవేంటంటే.. 

దానిమ్మ

దానిమ్మలో ఇనుము కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది డెంగ్యూ పేషెంట్లు త్వరగా కోలుకోవడానికి అవసరమైన బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి సహాయపడుతుంది. దానిమ్మ పండ్లను తినడం వల్ల శరీర  ఆరోగ్యం బాగుంటుంది. ఈ పండు అలసటను తగ్గిస్తుంది. నిజానికి డెంగ్యూ పేషెంట్లలో అలసట సర్వసాధారణం. ఇది ముదిరితే.. దీనినుంచి కోలుకోవడానికి కొన్ని వారాలు కూడా పట్టొచ్చు. 
 


kiwi

కివీలు

పలు అధ్యయనాల ప్రకారం.. కివి పండు డెంగ్యూ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఇది డెంగ్యూ లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని కనుగొన్నారు. కివీల్లో రాగి ఉంటుంది. ఇది ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే సంక్రమణ నిరోధకతనను పెంచడానికి కూడా సహాయపడుతుంది. కివీల్లో విటమిన్ ఇ, పొటాషియం, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. కివిల్లో ఎక్కువ మొత్తంలో ఉంటే  విటమిన్ సి రోగనిరోధకక శక్తిని పెంచుతుంది. ఇది డెంగ్యూకు వ్యతిరేకంగా పోరాడుతుంది. 
 

నారింజ

సిట్రస్ పండు అయిన నారింజ డెంగ్యూ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలు పరిశోధనలు నిరూపించాయి. నారింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. డెంగ్యూ రోగుల శరీరంలో తరచుగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలాగే బాగా అలసిపోతుంటారు. అయితే ఈ నారింజ పండ్లు డెంగ్యూ పేషెంట్ల రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. శరీరాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతాయి. డెంగ్యూ పేషెంట్లు భోజనానికి ముందు ఒక కప్పు నారింజ జ్యూస్ తాగితే వారి రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. 
 

papaya

బొప్పాయి

బొప్పాయి సారంలో జీర్ణ ఎంజైమ్ లు అయిన  చైమోపైన్, పాపైన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీర్ణక్రియకు  ఎంతో  సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయి ఆకులు డెంగ్యూతో పోరాడటానికి, తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 30 మి.లీ తాజా బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్ లెట్ ల సంఖ్య బాగా పెరుగుతుంది. దీంతో డెంగ్యూ జ్వరం తొందరగా తగ్గిపోతుంది.
 

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి.  నిజానికి నిర్జలీకరణం డెంగ్యూను ఎక్కువ చేస్తుంది.  కొబ్బరి నీటిలో తగినన్ని ఖనిజాలు, లవణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి ద్రవాలు తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. కొబ్బరి నీళ్లు శరీరం వేగంగా కోలుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

dragon fruit

డ్రాగన్ ఫ్రూట్

డ్రాగన్ ఫ్రూట్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ కంటెంట్ తో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగుల్లో సెల్యూలార్ రోగనిరోధక  శక్తిని పెంచుతుంది. అలాగే డెంగ్యూ హెమరేటిక్ జ్వరం నుంచి రక్షిస్తుంది. డెంగ్యూ జ్వరం వల్ల ఎముకల్లో విపరీతమైన నొప్పి కలుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ ఎముకలను తిరిగి బలంగా చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్ హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. 
 

అరటిపండు

అరటిపండ్లు చాలా సులువుగా జీర్ణం అవుతాయి. ముఖ్యంగా ఈ పండ్లు డెంగ్యూ పేషెంట్లు తర్వగా కోలుకోవడానికి సహయపడతాయి. అలాగే వీరి శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. ఈ పండు జీర్ణక్రియకు సహాయపడే ఉత్తమ పండు అంటారు డాక్టర్లు. అరటిపండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి బూస్టర్ లా పనిచేస్తాయి. 

Latest Videos

click me!