Pearl Necklace: అయిదు నుంచి ఏడు వరసల్లో ముత్యాల హారాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని సత్లాడా హారం అంటారు. వీటిని రాయల్ జ్యువెలరీగా చెప్పుకుంటారు. ముత్యాల హారాల డిజైన్లు ఇక్కడ ఇచ్చాము. ఓ లుక్కేయండి. మీకు నచ్చుతాయి.
సత్లాడా హారం అంటే 'ఏడు వరుసల హారం' అని అర్థం. అయితే ఇప్పుడు మార్కెట్లో 5 నుంచి 7 వరుసల్లో ముత్యాల వరుసలు ఉంటాయి. ఇవి వేసుకుంటే ఇది చాలా గ్రాండ్‌గా, రాయల్‌గా కనిపిస్తారు. చీర, లెహెంగా, సూట్.. ఇలా ఏ డ్రెస్‌మీదకైనా ఇవి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్ాయి. ఒకప్పుడు రాజకుటుంబాల మహిళలు, మహారాణులు మాత్రమే వీటిని ధరించేవారు.
24
ముత్యాల మీనాకారి హారాలు
ఈ హారాలలో ముత్యాలతో పాటు మీనాకారి వర్క్, కుందన్ స్టైల్ పెండెంట్లను కూడా వినిపియోగిస్తారు. ఇందులో 5 లేదా 7 వరుసల ముత్యాల మాల ఉండి, మధ్యమధ్యలో రంగురంగుల మీనాకారి డిజైన్ ఉంటుంది. ఈ హారం మెడలో వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు.
34
గోల్డెన్ బీడ్ సత్లాడా హారం
ఆఫ్ వైట్ ముత్యాలతో గోల్డెన్ బీడ్స్ కలిపిన ఈ హారం ఎంతో రాయల్ గా కనిపిస్తుంది. చూడటానికి హెవీగా కనిపించినా వేసుకుంటే చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చిన్న ముత్యాలు, తేలికపాటి హ్యాంగింగ్స్ వాడతారు.
తెల్లటి ముత్యాలతో పాటూ ఆకుపచ్చని ఎమరాల్డ్ (పచ్చలు) రాళ్ల కాంబినేషన్ తో వచ్చే హారం ఇది. చూసేందుకు చాలా ఎలిగెంట్, క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్‌లో గ్రీన్ స్టోన్ హ్యాంగింగ్స్ లేదా కుందన్ వర్క్ కూడా జోడిస్తారు. లెహెంగా, పెళ్లి దుస్తులపై ఇది చాలా అందంగా కనిపిస్తుంది.