భారత వ్యవసాయ పరిశోధన మండలి కి చెందిన ‘ కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ ఈ ప్రత్యేక రకాన్ని రూపొందించింది. సాధారణ బంగాళదుంపతో పోలిస్తే ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
ఐరన్ : సాధారణ బంగాళాదుంపలో కేవలం 0.57 మి.గ్రా ఇనుము ఉంటే... ఈ ఊదా బంగాళాదుంపలో ఏకంగా 3.22 మి.గ్రా ఉంటుంది. అంటే ఇది రక్తహీనతను 5 రెట్లు వేగంగా నయం చేస్తుంది.
విటమిన్ సి : సాధారణ పొటాటోలో 23.15 మి.గ్రా విటమిన్ సీ ఉంటే, కుఫ్రి జమునియాలో 42.75 మి.గ్రా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది.
జింక్ : సాధారణ దుంపల కంటే ఇందులో జింక్ (2.28 మి.గ్రా) చాలా ఎక్కువ. ఇది పిల్లల ఎముకల బలానికి, మెదడు ఎదుగుదలకు ఎంతో అవసరం.
న్యాచురల్ యాంటీఆక్సిడెంట్లు: దీని ఊదా రంగుకు కారణం 'ఆంథోసయనిన్స్' అనే ప్రత్యేక సమ్మేళనం. ఇది క్యాన్సర్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించే నాచురల్ యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
తక్షణ శక్తిని ఇచ్చే పర్పుల్ బంగాళదుంప..
ఈ ఊదా రంగును చూసి ఇందులో ఏమైనా కెమికల్స్ లేదా రంగులు కలిపారేమో అని భయపడాల్సిన పనిలేదు. 'బయోఫోర్టిఫికేషన్' అనే వినూత్న సాంకేతికత ద్వారా ఈ పోషకాలన్నింటినీ విత్తనంలోనే సహజంగా అభివృద్ధి చేశారు. 2024లో అధికారికంగా విడుదలైన ఈ రకం పూర్తిగా సురక్షితమైనది. దీనిని తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.