Salt: ఉప్పును కేవలం రుచి కోసం వంటల్లో వాడడమే కాదు… మన సంస్కృతిలో ఉప్పుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా ఇది తీరుస్తుందట. శుద్ధి, రక్షణ, శ్రేయస్సు, అదృష్టానికి ఉప్పును వినియోగించవచ్చు.
ప్రతి ఇంట్లోనూ ఉప్పు ఉంటుంది. వంటకాలు రుచిగా ఉండాలంటే సరిపడినంత ఉప్పు పడాల్సిందే. అయితే ఇంటి సమస్యలు కూడా తీర్చే గుణం ఉప్పుకు ఉంది. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పును అనేక రకాలుగా వాడొచ్చు. ఆరోగ్యం కోసం, కొద్దిగా ఉప్పును అరచేతిలో తీసుకుని రుద్దాలి. 'ఈ ఉప్పు, నీటితో నా సమస్యలన్నీ పోయాయి' అని అనుకుంటూ చేతులు కడుక్కోవాలి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ పోయి మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
మీ అదృష్టం ఉప్పులోనే ఉందని చెబితే అతిశయోక్తి కాదు. ఒక చిన్న వస్త్రంలో ఉప్పు వేసి ఎడమ జేబులో పెట్టుకుంటే అదృష్టం మనతోనే ఉంటుందనే నమ్మకం ఉంటుంది.
23
డబ్బు, సంపద కోసం ఉప్పు
ఇంట్లో ఉప్పు అయిపోతే ఆ డబ్బా నింపడానికి ఒక ప్రత్యేక రోజు ఉంది. శుక్రవారం రోజు ఉప్పు డబ్బాను పూర్తిగా నింపితే, ఇంట్లో ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. అలాగే జీతం వచ్చాక, ఆ డబ్బు లేదా కార్డుపై కొద్దిగా ఉప్పు చల్లితే ధన యోగం పెరుగుతుందని కూడా నమ్ముతారు.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉప్పు చల్లితే, నెగటివ్ ఎనర్జీ నుంచి ఇంటికి రక్షణ లభిస్తుంది. ఈ పనిని సంవత్సరానికి నాలుగు సార్లు చేస్తే సరిపోతుంది.
33
ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ
ప్రతిరోజూ ఉదయం ఇల్లు శుభ్రం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిలుస్తుంది.ఃమీరు ఒత్తిడితో బాధపడుతున్నా లేదా ఏదైనా చెడు అనుభవం ఎదురైనా.. మీ ఎడమ భుజం మీదుగా చిటికెడు ఉప్పును వెనక్కి విసిరేయండి. ఇలా చేస్తే టెన్షన్ దూరమవుతుందని నమ్మకం.