Sugar Vs Rock Sugar: పంచదార కీ, స్పటిక బెల్లానికీ తేడా ఏంటి? రెండూ ఒకటి కాదా..?

Published : Nov 25, 2026, 09:29 AM IST

Sugar Vs Rock Sugar: మనకు మార్కెట్లో స్పటిక బెల్లం లభిస్తుంది. చూడటానికి అచ్చం పంచదారలాగానే ఉంటుంది. కానీ, నిజానికి ఈ రెండింటికీ తేడా ఏంటి? పంచదార మంచిది కాదని చెప్పి, దీనిని మాత్రం ఎందుకు తినమంటారు?

PREV
13
స్పటిక బెల్లానికీ, పంచదారకు తేడా ఇదే..

గుడిలో ప్రసాదంగా ఇచ్చినా, భోజనం తర్వాత సోంపుతో కలిపి నోట్లో వేసుకున్నా... స్పటిక బెల్లం రుచే వేరు. సాధారణ పంచదారకు బదులుగా చాలా మంది స్పటిక బెల్లాన్ని ఆరోగ్యానికి మంచిదని వాడుతుంటారు. అయితే, అసలు ఈ స్పటిక బెల్లం ఏంటి? దీనిని వేటితో తయారు చేస్తారు? నిజంగానే పంచదార, స్పటిక బెల్లం రెండూ ఒకటేనా లేక వేర్వేరా..? చాలా మందికి తెలియని ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

23
స్పటిక బెల్లం అంటే ఏంటి? దేనితో తయారు చేస్తారు..?

స్పటిక బెల్లం అనేది సహజసిద్ధమైన, తక్కువ ప్రాసెస్ చేసిన తీపి పదార్థం. దీనినే ఉత్తర భారతదేశంలో మిశ్రీ లేదా.. ఇంగ్లీష్ లో రాక్ షుగర్ అని పిలుస్తారు. దీనిని చెరకు రసం లేదా తాటి చెట్టు రసం నుంచి తయారు చేస్తారు. చెరకు రసాన్ని మరిగించి, దానికి ఎలాంటి రసాయనాలు కలపకుండా సహజపద్ధతిలో చల్లబరిచినప్పుడు.. అది పెద్ద పెద్ద స్పటికాల రూపంలో గడ్డకడుతుంది. దీనినే మనం స్పటిక బెల్లం అంటాం.

పంచదార, స్పటిక బెల్లం రెండూ ఒకటేనా? తేడా ఏంటి?

రెండూ చెరకు రసం నుంచే తయారైనప్పటికీ, తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. పంచదార తయారీలో.. అది మనకు మెరుస్తూ కనపడటం కోసం.. సల్ఫర్ డయాక్సైడ్ , ఫాస్పారిక్ యాసిడ్ వంటి రసాయనాలతో శుద్ధి చేస్తారు. దీని వల్ల అందులోని పోషకాలన్నీ నశిస్తాయి. కానీ స్పటిక బెల్లాన్ని ఎలాంటి రసాయనాలు లేకుండా సహజ పద్ధతిలో తయారు చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం..పంచదార శరీరంలో వేడిని పెంచితే, స్పటిక బెల్లం శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాదు.. పంచదారతో పోలిస్తే.. స్పటిక బెల్లం కాస్త తక్కువ తీపిని కలిగి ఉంటుంది.

33
స్పటిక బెల్లం వల్ల కలిగే లాభాలు...

గొంతు నొప్పి, దగ్గుకు చెక్: దగ్గు, గొంతు గరగరగా ఉన్నప్పుడు మిరియాల పొడితో కలిపి స్పటిక బెల్లం చప్పరిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: భోజనం తర్వాత సోంపుతో కలిపి స్పటిక బెల్లం తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది, నోటి దుర్వాసన కూడా పోతుంది.

శరీరానికి తక్షణ శక్తి: ఎండలో తిరిగి అలసిపోయినప్పుడు గ్లాసు నీళ్లలో స్పటిక బెల్లం పొడి కలుపుకొని తాగితే వెంటనే ఎనర్జీ వస్తుంది.

హిమోగ్లోబిన్ పెరుగుదల: రక్తహీనతతో బాధపడేవారికి ఇది మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.

Read more Photos on
click me!

Recommended Stories