Published : May 26, 2026, 01:49 PM ISTUpdated : May 26, 2026, 02:03 PM IST
హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంట్లో తులసి కోటను పెట్టి రోజూ పూజలు చేస్తారు. కానీ వేసవి రాగానే చాలా ఇళ్లలో తులసి మొక్క ఎండిపోతుంది. అయితే కేవలం రూ.2 ఖర్చుతో తులసి మొక్కను మళ్లీ పచ్చగా మార్చుకోవచ్చు.
ఎండాకాలంలో సాధారణంగానే మొక్కలు వాడిపోతుంటాయి… ఇక మే, జూన్ నెలల్లో ఎండ తీవ్రత, వేడి గాలులు ఎక్కువ కావడంతో ఎండిపోతుంటాయి. ఇలా సున్నితమైన తులసి మొక్కలు కూడా వాడిపోవడం, ఎండిపోవడం జరుగుతాయి. ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క బలహీనపడుతుంది.. కొన్నిసార్లు పూర్తిగా చనిపోయినట్లు కనిపిస్తుంది.
అయితే హిందువులు ఇంటిముందు పెట్టి పూజించే తులసి మొక్క ఎండిపోవడాన్ని అశుభంగా భావిస్తారు. అందుకే చాలామంది ఎండల్లో ఈ మొక్కను బ్రతికించుకునేందుకు ఖరీదైన ఎరువులు, రసాయనాలు వాడుతుంటారు. కానీ ఎలాంటి రసాయానాలు వాడకుండానే ఇంట్లోని వస్తువులతోనే తులసి మొక్కను మళ్లీ పచ్చగా మార్చవచ్చు. ఈ సింపుల్ ట్రిక్ ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిందే.
24
కేవలం రూ.2 ఖర్చుతో తులసిమొక్క సేఫ్..
ఒక గిన్నెలో అర లీటరు నీళ్లు తీసుకోండి. దానికి కొద్దిగా కాఫీ పొడి, అర టీస్పూన్ ఎప్సమ్ సాల్ట్ కలపండి. ఈ మిశ్రమాన్ని తులసి మొక్క వేర్ల దగ్గర మట్టిలో నెమ్మదిగా పోయాలి. ఇలా చేశారో మీ తులసిమొక్క మునుపటిలా పచ్చగా మారుతుంది.
కాఫీ పొడిలోని నైట్రోజన్ మట్టికి పోషకాలను ఇస్తుంది… దీంతో తులసిమొక్క బలంగా మారుతుంది. ఇక ఎప్సమ్ సాల్ట్‌లోని మెగ్నీషియం, సల్ఫేట్ ఆకులు పచ్చగా మారడానికి సాయపడతాయి. ఇది ఎండకు దెబ్బతిన్న మొక్కలకు టానిక్‌లా పనిచేస్తుంది.
34
కాఫీ పొడి, ఎప్సమ్ సాల్ట్ తో తులసిమొక్కకు పనరుజ్జీవం..
మధ్యాహ్నం ఎండలో ఈ మిశ్రమాన్ని తులసిచెట్టుకు వేయరాదు. ఉదయం లేదా సాయంత్రం వేయడం మంచిది. మట్టిని కొద్దిగా గుల్లగా చేశాకే ఈ ద్రావణాన్ని పోయాలి. ఆ తర్వాత మొక్కను నేరుగా ఎండలో కాకుండా, కొద్దిగా నీడ ఉన్న చోట ఉంచండి. నీళ్లు ఎక్కువగా పోయొద్దు, మట్టిలో తేమ ఉంటే చాలు.
ఇలా వారానికి ఒకసారి చేస్తే, కొన్ని రోజుల్లోనే తులసి మొక్కకు కొత్త చిగుళ్లు వస్తాయి. ఎండాకాలంలో కూడా తులసిమొక్క వాడిపోకుండా పచ్చగా ఉంటుంది… ఇంటిముందు అందంగా కనిపిస్తుంటుంది. ఇలా ఖరీదైన ఎరువులు కొనాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో దొరికే వాటితోనే మీ తులసి మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు.. ఎలాంటి అశుభ సంకేతాలు లేకుండా జాగ్రత్తపడవచ్చు.