Multani mitti: ముల్తానీ మిట్టిని ప్రాచీన కాలం నుంచి సౌందర్య సాధానంగా వాడుతున్నారు. అయితే చాలామంది దీన్ని చర్మానికే వాడుతారు. నిజానికి జుట్టు పెరుగుదలకు కూడా ముల్తాని మిట్టి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలో తెలుసుకోండి.
జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ముల్తాని మిట్టిని జుట్టుకు అప్లై చేయండి. హెయిర్ ప్యాక్‌లు, షాంపూలు, కండిషనర్ల ఉత్పత్తులను వాడే బదులు ముల్తానీ మిట్టి వాడితే జుట్టు సహజంగానే పెరగడం ప్రారంభమవుతుంది. ముల్తానీ మిట్టిని ఆయుర్వేదంలో భాగంగా వినియోగిస్తారు. ముల్తానీ మిట్టి జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.
24
ముల్తాని మిట్టి హెయిర్ ప్యాక్
ముల్తానీ మిట్టిలో నీళ్లు వేసి పేస్టులా చేసి జుట్టు మాడుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల అక్కడ రక్తప్రసరణ పెరుగుతుంది. తలపై ఎప్పుడైతే రక్తప్రసరణ మెరుగుపడిందో వెంట్రుకల కుదుళ్లు బలంగా మారి పెరగడం మొదలవుతుంది. అలాగే జుట్టు రాలడం కూడా చాలా వరకు ఆగిపోతుంది. వేసవిలోనే ముల్తానీ మిట్టిని తలకు పట్టిస్తే మంచిది. ఇది చెమట కారణంగా వచ్చే జుట్టు దుర్వాసనను రాకుండా అడ్డుకుంటుంది. ముల్తానీ మిట్టిని ఉపయోగించడం వల్ల తల చర్మం కూడా శుభ్రపడుతుంది. తలపై ఉన్న మురికి, దుమ్ము పోతాయి.
34
చుండ్రు తగ్గుతుంది
చుండ్రు సమస్యను తగ్గించడంలో కూడా ముల్తాని మిట్టి అద్భుతంగా పనిచేస్తుంది. చుండ్రు వల్ల తల దురద పెట్టడం, జుట్టు రాలిపోవడం వంటివి జరుగుతాయి. అయితే ముల్తాని మిట్టి తలకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గడంతో పాటు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లకు మాత్రమే కాదు తల చర్మానికి కూడా ముల్తాని మిట్టి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. దీని వల్ల జుట్టు చివర్లు చిట్లిపోవడం తగ్గుతుంది. అలాగే వెంట్రుకలు మృదువుగా మెరిసేలా ఉంటాయి.
జుట్టు పొడిబారే సమస్యతో బాధపడుతున్న వారు ముల్తానీ మిట్టిని జుట్టు కుదుళ్ల వరకు లోతుగా రాయడం మంచిది. ఇది కండిషనర్ లా పనిచేస్తుంది. జుట్టుకు కొత్త మెరుపును, జీవశక్తిని అందిస్తుంది. స్ట్రైయిటనింగ్ వంటి పద్ధతులను పాటించే బదులు ముల్తాని మిట్టిని జుట్టుకు రాస్తే సిల్కీగా తయారవుతుంది.
ముల్తానీ మిట్టిని ఉపయోగించడం ఎలాగో ముందుగా తెలుసుకోండి. ఒక గిన్నెలో ముల్తానీ మిట్టి, పెరుగు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని తలకు పట్టించవచ్చు. లేదా కలబంద జెల్ తో ముల్తానీ మిట్టి కలిపి పేస్ట్ లాగా చేసుకుని జుట్టుకు పట్టించాలి. దీనివల్ల అధిక నూనె, చుండ్రు వంటివి తగ్గుతాయి. ఇది అద్భుతమైన హెయిర్ మాస్క్. ఒక అరగంట తర్వాత మీ జుట్టు తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.