బియ్యప్పిండి మరీ ఎక్కువగా వేయొద్దు: మొదట తక్కువ పరిమాణంతోనే ప్రయత్నించండి. మరీ ఎక్కువగా కలిపితే దోశ గట్టిగా లేదా పొడిగా మారిపోయే అవకాశం ఉంది.
పెనం వేడి సరిగ్గా ఉండాలి: పెనం సరిగ్గా వేడెక్కకపోతే పిండి అతుక్కుపోతుంది. అలాగని మరీ ఎక్కువ వేడి ఉంటే దోశ సరిగ్గా కాలకుండా మాడిపోతుంది.
పిండిని పలుచగా పరచాలి: దోశ మందంగా ఉంటే అంతటా ఒకేలా కరకరలాడదు. కాబట్టి పిండిని వీలైనంత పలుచగా వేయాలి.
కాలడానికి తగిన సమయం ఇవ్వాలి: తొందరపడి దోశను ముందే తిప్పేయడం లేదా తీసేయడం చేయకండి. అడుగు భాగం లేత బంగారు రంగులోకి మారే వరకు ఆగితేనే అసలైన క్రిస్పీనెస్ వస్తుంది.
సో, ఇకపై ఇంట్లో హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు రావడం లేదని చింతించాల్సిన పనిలేదు. ఎలాంటి హంగులు లేకుండా, చిటికెడు బియ్యప్పిండి చిట్కాతో మీ బ్రేక్‌ఫాస్ట్‌ను సూపర్ క్రిస్పీగా మార్చేయండి.