Relationship : భార్యాభర్తల బంధం అనేది కేవలం శారీరకమైనదే కాదు సాంప్రదాయ బద్దమైనది కూడా. కాబట్టి కొన్ని సమయాల్లో శారీరక సంబంధానికి ఆలుమగలు దూరం ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
భార్యాభర్తలు కొన్ని సమయాల్లో అస్సలు శారీరకంగా కలవకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి... అలాకాదని శృంగారంలో పాల్గొంటే దానివల్ల అనేక అనర్థాలు కలుగుతాయట. ఇలా కొన్ని గడియల్లో కలయిక వల్ల గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఈ ప్రభావం పడుతుందని... మానసిన, శారీరక వైకల్యానికి కారణం కావచ్చని చెబుతుంటారు పండితులు. అంతేకాదు భార్యాభర్తల మధ్య విబేధాలకు కూడా కొన్ని సమయాల్లో శారీరక కలయిక కారణం కావచ్చట. మరి భార్యాభర్తలు ఏఏ సమయంలో నిష్టగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.
26
అమావాస్య, పౌర్ణమికి శృంగారం వద్దు
సాధారణంగా ప్రతి నెలలో వచ్చే అమావాస్య, పౌర్ణమి చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో దుష్టశక్తులు బలంగా ఉంటాయి కాబట్టి భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. లేదంటే వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపి కుటుంబ, సంతాన సమస్యలు తప్పవు.
36
చతుర్దశి, అష్టమికి కూడా వద్దు
ఇక ప్రతి నెలా చతుర్ధశి, అష్టమి తిథులలో భార్యాభర్తలు శృంగారంలో పాల్గొనకూడదట. ఈ రోజుల్లో కలయిక పిల్లలు, కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పితృపక్షాల సమయంలో శరీరం, మనస్సు, మాటలు స్వచ్ఛంగా ఉండాలి. ఈ సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ రోజుల్లో శారీరకంగా కలిస్తే పితృదేవతలకు కోపం వస్తుందట... వారి అనుగ్రహం లభించదని పండితులు కూడా చెబుతుంటారు.
56
నవరాత్రుల్లోనూ వద్దు
నవరాత్రి రోజులను చాలా పవిత్రంగా భావిస్తారు. చాలామంది ఇళ్లలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కాబట్టి ఆ సమయంలో స్త్రీపురుషులు శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి… లేదంటే దైవ అనుగ్రహానికి దూరం అవుతారని చెబుతుంటారు.
66
ఉపవాసం రోజు శృంగారం వద్దు
ఉపవాసం చేసేవారు ఆ రోజు పవిత్రంగా, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు. ఇది పిల్లల ఆరోగ్యం, జీవితంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇక నెలసరి సమయంలో కూడా మహిళలు భర్తతో కలవకూడదు... ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.