ప్రశాంతమైన జీవనం, యోగా, మెడిటేషన్, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం చాలా మంది గోవాను ఎంచుకుంటారు. అయితే ఇక్కడ వెల్‌నెస్ సెంటర్లు, జిమ్‌లు, సోషల్ క్లబ్‌ల సభ్యత్వాలు ఖరీదైనవి. వారాంతాల్లో పార్టీలు, అవుటింగ్‌లకు వెళ్లే అలవాటు ఉంటే ఖర్చు మరింత పెరుగుతుంది. గోవా ఇచ్చే స్వేచ్ఛా వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే జేబులో తగినంత డబ్బు ఉండాల్సిందే. అనుకున్న దానికంటే ఎక్కువగానే ఇక్కడ ఇతర ఖర్చులు ఉంటాయి.
కల వర్సెస్ వాస్తవం
బీచ్ ఒడ్డున ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఆ కల నిజం కావాలంటే పక్కా ఆర్థిక ప్రణాళిక అవసరం. గోవాలో నాణ్యమైన జీవితం దొరుకుతుంది అనడంలో సందేహం లేదు, కానీ పెరిగిన ధరల దృష్ట్యా ఇక్కడ జీవనం సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా మెట్రో నగరాల నుండి వచ్చే వారు ఇక్కడి అద్దెలు, రవాణా ఇబ్బందులను గమనించి నిర్ణయం తీసుకోవాలి. సరైన ప్లానింగ్ ఉంటేనే గోవాలో ప్రశాంతమైన జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది.