Health Tips: ఆరోగ్యానికి మంచివని గుమ్మడి గింజలను అదే పనిగా తింటే మీ పని అంతే..

Published : Jul 17, 2022, 12:29 PM ISTUpdated : Jul 17, 2022, 12:30 PM IST

Health Tips: గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలా అని మోతాదుకు మించి వీటిని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

PREV
18
 Health Tips: ఆరోగ్యానికి మంచివని గుమ్మడి గింజలను అదే పనిగా తింటే మీ పని అంతే..

గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పొటాషియం, అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు, జింక్, భాస్వసరం, కొవ్వు ఆమ్లాలు వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే ముఖంపై మొటిమలను వదిలిస్తాయి. హెయిర్ ఫాల్ సమస్యను నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 
 

28

అంతేకాదు గుమ్మడి గింజలను తరచుగా తినడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా పురుషులు వీటిని తినడం వల్ల వీర్యం సంఖ్య కూడా పెరుగుతుంది. సంతానోత్పత్తి సమస్యలున్న వారు వీటిని తింటే మంచి ఫలితం  ఉంటుంది. 
 

38

దీనిలో యాంటీ డయాబెటీక్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇవే కాదు గుమ్మడి గింజలు మన ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి. అలా అని అదే పనిగా వీటిని తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోతాదుకు మించి గుమ్మడి గింజలను తినడం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

48

కడుపులో నొప్పి

ఈ గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. శరీరంలో ఫైబర్ ఎక్కువైతే కడుపులో సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువైతే గ్యాస్ సమస్య ఏర్పడి.. కడుపు నొప్పి వస్తుంది. అందుకే శరీర అవసరానికి మించి ఫైబర్ ను తీసుకోకూడదు. 
 

58

బరువు పెరుగుతారు

గుమ్మడి గింజలను మోతాదుకు మించి తీసుకుంటే చాలా సులువుగా బరువు పెరుగుతారు. ఎందుకంటే దీనిలో కేలరీలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రోజుకు రెండు స్పూన్ల కంటే ఎక్కువ తీసుకుంటే మీరు బరువు పెరగడం ఖాయం. 

68

అలర్జీ

గుమ్మడి గింజలను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు లభిస్తాయి. అయితే ఈ పోషకాలు అవసరం వరకే తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే కొంతమంది అలెర్జీ బారిన పడుతుంటారు. గొంతులో నొప్పి, నోరంతా ఎర్రగా అవడం, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 
 

78

గొంతు దెబ్బతింటుంది

రుచిగా ఉన్నాయని అదెపనిగా  గుమ్మడి గింజలను తింటే గొంతు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ఏమి తాగలేరు, తినలేరు. సో ఇప్పటి నుంచి చూసి తినండి. 
 

88

రక్తపోటు ఉన్నవాళ్లు తినకూడదు

రక్తపోటు తక్కువగా ఉన్నవాళ్లు గుమ్మడి గింజలకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ గింజలు అధిక రక్తపోటు స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇక బీపీ తక్కువగా ఉన్నవాళ్లు తింటే బీపీ మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మోతాదులోనే తినండి. ఎంతమంచివైనా.. పరిమితికి మించి తింటే తిప్పలు ఎదుర్కోకతప్పదు. 
 

Read more Photos on
click me!

Recommended Stories