ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువైందా? ఇలా చేస్తే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు తెలుసా..

Published : Jul 17, 2022, 10:39 AM IST

ఇంట్లో ఎలుకలతో రకరకాల సమస్యలు పుట్టుకొస్తుంటాయి. ఏడ పేపర్ కనిపించినా.. బట్టలు కనిపించినా వాటిని.. పాడుచేయకుండా ఉండవు. అయితే కొన్ని సింపల్ టిప్స్ తో ఇంట్లో ఇక్క ఎలుక కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగంటే..  

PREV
16
ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువైందా? ఇలా చేస్తే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు తెలుసా..
rats

చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నా.. విసుగు తెప్పించడంలో ఇవే ముందుంటాయి. ఇంట్లోకి దూరి పేపర్లను, బట్టలను  పనికిరాకుండా చేస్తుంటాయి. అంతేకాదు ఇల్లునంతా పెట్టకుప్ప మాదిరి మార్చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉండే కరెంట్ వైర్లను, ఇతర తీగలను కూడా కట్ చేస్తుంటాయి. దీనికి తోడు ఎలుకలు ఎన్నో ప్రమాదరకమైన రోగాలను కలిగిస్తుంటాయి. అందుకే ఎలుకలు  ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అయితే కొంతమంది ఎలుకల బోనులు పెడుతుంటారు. అయినా అవి మాత్రం పడవు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగించి ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
peppermint oil

పుదీనా నూనె

పుదీనా నూనెను ఉపయోగించి కూడా ఎలుకలను ఇంట్లో నుంచి తరిమికొట్టొచ్చు. ఎందుకంటే పుదీనా నూనె వాసన ఎలుకలకు నచ్చదు. దీనివాసన ఏక్కడినుంచొచ్చినా అక్కడినుంచి పారిపోతాయి. ఇందుకోసం కాటన్ బాల్స్ చేసి పుదీనా నూనెలో అద్ది మూలల్లో పెట్టాలి. 
 

36

ఉల్లి

ఉల్లిపాయల వాసన ఎలుకలకు ఏ మాత్రం నచ్చదు. ఉల్లికి ఎలుకలు చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఎలుకలు ఎక్కువైనప్పుడు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి ఇంటి మూలల్లో పెట్టండి. ఉల్లిపాయలు చాలా తొందరగా వాడిపోతాయి కాబట్టి రెండు మూడు రోజులకోసారి ఉల్లిపాయ ముక్కలను మార్చండి. 

46

కోకో పౌడర్

ఇంట్లో నుంచి ఎలుకలను పూర్తిగా వెల్లిపోయేలా చేయడానికి కోకో పౌడర్ ఎంతో సహాయపడుతుంది. ఈ కోకో పౌడర్ తో రాట్ కిల్లర్ ను తయారుచేయొచ్చు. ఈ కోకో పౌడర్ ఎలుకలకు చాలా ఇష్టం. దీనికి ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారిస్ పౌడర్ ను జోడించి ఎలుకలు ఉండే ప్లేస్ లో పెట్టాలి. వీటిని ఎలుకలు తింటే వాటి పేగులకు అది అంటుకుని ఎలుకలు చనిపోతాయి. 
 

56

ఎండుమిర్చి

ఎండుమిర్చిని ఉపయోగించి కూడా ఎలుకలను తరిమికొట్టొచ్చు. ఎండుమిరపకాయలతో ఎలుకలను చంపకుండా.. ఇంట్లో నుంచి బయటకు పోయేలా చేయొచ్చు. ఇందుకోసం ఎలుకలు వెళ్లే దారిలో మిరప పొడిని లేదా ఎండుమిరపకాయలను పెట్టండి. 
 

66

ఉంటిని శుభ్రంగా ఉంచండి

ఇంట్లోంచి ఎలుకలు బయటకు వచ్చిన తర్వాత ఇంటినంతా శుభ్రం చేయండి. లేదంటే ఎలుకలు మళ్లీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటిని ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకుంటే ఎలుకలు రావు. 

 

Read more Photos on
click me!

Recommended Stories