Music Lovers Psychology: మ్యూజిక్ ఎక్కువగా వినేవారి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?

Published : Jan 12, 2026, 04:57 PM IST

మ్యూజిక్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రపంచాన్ని మర్చిపోయే వాళ్లు చాలామంది ఉంటారు. మ్యూజిక్‌ని ఇంతగా ఇష్టపడే వారి మనసు ఎలా ఉంటుంది? కొందరు పాటలు వినకుండా ఎందుకు ఉండలేరు? వీరి గురించి సైకాలజీ ఏం చెప్తోందో తెలుసా?

PREV
16
Music Lovers Psychology

సైకాలజీ నిపుణుల ప్రకారం.. సంగీతం వినోదం మాత్రమే కాదు. అది మన ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనపై లోతైన ప్రభావం చూపే శక్తివంతమైన మానసిక సాధనం. రోజూ ఎక్కువసేపు పాటలు వినే వ్యక్తులు సాధారణంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. తమ భావాలను లోతుగా అనుభవించే స్వభావం కలిగి ఉంటారు.

26
లోతుగా స్పందించే స్వభావం

సైకాలజీ ప్రకారం సంగీతం మన మెదడులోని లింబిక్ సిస్టమ్‌ను ఉత్తేజితం చేస్తుంది. ఇదే భాగం మన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, ఆనందం, దుఃఖం వంటి అనుభూతులను నియంత్రిస్తుంది. అందుకే మ్యూజిక్ ఎక్కువగా వినే వారు చిన్న విషయాలకే లోతుగా స్పందిస్తారు. వారు ఇతరుల భావాలను సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మ్యూజిక్ లవర్స్ సాధారణంగా స్నేహితుల సమస్యలను ఓర్పుతో వింటారు. సానుభూతితో స్పందిస్తారు.

36
ఎమోషనల్ థెరపీ

మ్యూజిక్ వినడం ఒక రకమైన ఎమోషనల్ థెరపీగా కూడా పనిచేస్తుందని సైకాలజీ చెబుతోంది. ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి భావాల నుంచి బయటపడేందుకు చాలామంది పాటలను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా నిశబ్దంగా ఉండలేనివారు, ఎక్కువగా ఆలోచించే స్వభావం ఉన్నవారు మ్యూజిక్ ద్వారా ఉపశమనం పొందుతారు. అందుకే సంగీతం వినేవారు కొన్నిసార్లు బాహ్య ప్రపంచానికి దూరంగా, తమ సొంత లోకంలోకి వెళ్లిపోతారు.

46
ఊహాశక్తిని పెంచే సాధనంగా..

మ్యూజిక్ ఎక్కువగా వినే వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని సైకాలజీ విశ్లేషణలు చెబుతున్నాయి. పాటల లిరిక్స్, మెలోడీ, రిథమ్ ఇవన్నీ కలిసి ఊహాశక్తిని పెంచుతాయి. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు సంగీతాన్ని తమ ఆలోచనలకు ప్రేరణగా ఉపయోగిస్తారు. సంగీతం వారి మనసును ఓపెన్ చేసి, కొత్త ఆలోచనలను స్వీకరించేలా చేస్తుంది. అందుకే మ్యూజిక్ లవర్స్ సాధారణంగా కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తి చూపుతారు.

56
పాటల రకాన్ని బట్టి..

వ్యక్తి వినే సంగీత రకం కూడా అతని మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శాంతమైన మెలోడీ పాటలు వినేవారు సాధారణంగా స్థిరమైన మనసు, సహనం కలిగి ఉంటారు. రాక్ లేదా హెవీ బీట్ మ్యూజిక్ వినేవారు తమలోని అణచివేసిన భావోద్వేగాల నుంచి బయటపడ్డానికి సంగీతాన్ని ఉపయోగిస్తారు. ప్రేమ గీతాలు వినేవారు భావోద్వేగపరంగా లోతైన అనుబంధాలను కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. వ్యక్తి మనస్థితి మారిన కొద్దీ అతని ప్లేలిస్ట్ కూడా మారుతుందని సైకాలజీ విశ్లేషణలు చెబుతున్నాయి.

66
మానసిక బలానికి..

సంగీతాన్ని ఎక్కువగా వినే వారు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఇష్టపడినట్లు అనిపించినా, వారు అసలు ఒంటరివాళ్లు కాదని నిపుణులు చెబుతున్నారు. వారు తమ లోతైన భావాలను అర్థం చేసుకునేందుకు, వాటితో సంభాషించేందుకు సంగీతాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగిస్తారు. ఇది వారిని మానసికంగా బలంగా తయారు చేస్తుంది. కష్ట సమయాల్లో త్వరగా కుంగిపోకుండా, పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లే శక్తిని సంగీతం వీరికి ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories