కేవలం సంక్రాంతికి మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఒక్కరోజే గర్భగుడిలో దేవుడి విగ్రహం..!

Published : Jan 12, 2026, 03:42 PM IST

Makara Sankranti 2026: మధ్యప్రదేశ్‌ పన్నా జిల్లాలోని అజయ్‌గఢ్ కోట చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ ఒక ఆలయం ఉంది… ఇది మకర సంక్రాంతి రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఒకే రోజు ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు. 

PREV
14
అజయ్‌గఢ్ కోట రహస్యం ఏమిటి?

చారిత్రకారుల ప్రకారం… 9 నుండి 13వ శతాబ్దం వరకు బుందేల్ ఖండ్ ను పాలించిన చందేలా రాజులు అజయ్ గడ్ కోటను నిర్మించారు. వింద్యా పర్వతశ్రేణుల్లో ఈ కోట ఉంటుంది. ఈ కోటలో స్థానిక దైవంగా భావించే బాబా అజయ్ పాల్ ఆలయం ఉంది. ఈ ఆలయం కేవలం మకర సంక్రాంతికి మాత్రమే తెరుచుకుంటుంది. 

24
ఒక్క రోజు మాత్రమే ఆలయంలో బాబా విగ్రహం..

ఏడాదిపోవడవునా అజయ్‌గఢ్ కోటలోని బాబా అజయ్ పాల్ ఆలయం మూసివుంటుంది… ఇందులో దేవుడి విగ్రహం ఉండదు. మకర సంక్రాంతి రోజున రేవా మ్యూజియం నుంచి బాబా అజయ్ పాల్ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. మరుసటి రోజు తిరిగి మ్యూజియంకు తరలిస్తారు. ఇలా ఒకే ఒక్కరోజు ఆలయంలో విగ్రహాన్ని దర్శించుకోవచ్చు.. మిగతా రోజుల్లో ఆలయం మూసివుంటుంది. 

34
ఇక్కడి నిధుల గురించి ఒక నమ్మకం ఉంది

అజయ్‌గఢ్ కోటలో చాలా మూసి ఉన్న సొరంగాలు ఉన్నాయి. ఈ సొరంగాల్లో చందేల రాజుల నిధి దాగి ఉందని నమ్మకం. చాలా మంది దీని కోసం ప్రయత్నించి విఫలమయ్యారు.

అజయ్ గడ్ కోటలో ఓ పురాతన శాసనం ఉంది... దీన్ని ఇప్పటివరకు ఎవరూ అర్థంచేసుకోలేకపోయారు. దీనిలోనే చందేలా రాజుల రహస్య సంపదకు మార్గం ఉండవచ్చని భావిస్తున్నారు.

44
గవి గంగాధరేశ్వర ఆలయం కూడా ఇలాగే..

కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాగే కేవలం సంక్రాంతికే తెరుచుకునే మరో ఆలయం ఉంది. ప్రతి ఏడాది సరిగ్గా మకర సంక్రాంతి రోజుల గవి గంగాధరేశ్వర ఆలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. ఈ సమయంలో ఆలయమంతా కాంతిలో వెలిగిపోతుంది. ఈ ప్రత్యేక సమయంలో స్వామిని దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ ఆలయాన్ని 16 శతాబ్దంలో కెంపెగౌడ్ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories