Psychology: మంచితనం ఎప్పుడు మంచిది కాదు..? సైకాలజీ ఏం చెప్తోందంటే..

Published : Jun 26, 2026, 04:51 PM IST

Psychology: సహాయం చేయడం, మంచితనం ..ఎప్పుడూ చెడు కాదు. కానీ అది ఎప్పుడు ఇబ్బంది పెడుతుందంటే...తప్పుడు వ్యక్తులకు చేస్తే అవుతుంది. విలువ ఇవ్వని, విలువలేని వారికి హెల్ప్ చేయడం డేంజర్. ఈ అతి మంచితనానికి సైకాలజీలో 2 కారణాలు ఉన్నాయి. అవెంటో తెలుసా? 

PREV
15
అపాత్రదానం చేయకూడదు

ఎవరికీ అపాత్రదానం చేయకూడదు. మన అవసరం లేకపోయినా సరే..అక్కడ కలుగచేసుకుని పెద్ద పీట వేయడం అసలు మంచిది కాదు. ఇది చాలా ప్రమాదకరం. వీరిలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు. మీరు చేసిన సహాయాన్ని, మంచితనాన్ని గుర్తు పెట్టుకుని కృతజ్ఞత పెట్టుకునే వారు మొదటిరకం. వీళ్లతో ఎలాంటి సమస్య ఉండదు. జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. రెండో రకం వారు..సహయం తీసుకుంటారు, మనుషులను ఉపయోగించుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోరు, మర్చిపోతారు కూడా. 

25
మూడోరకం డేంజరేస్

ఇక మూడోరకం వాళ్లు వెరీ డేంజరేస్. వీళ్లతోనే అతిపెద్ద సమస్య. మీ మంచితనాన్ని, సహాయాన్ని ఉపయోగించుకుని...జలగలా పీల్చేస్తారు. అయ్యో పాపం అని సహాయం చేస్తే...దాన్ని అవసరంగా మొత్తం పిండేస్తారు. వీళ్ల చేతిలో పడితే మాత్రం అంతే. చివరికి వారి వల్ల వాడి పాడైపోయిన క్రికెట్ బాల్ లాగా అయిపోతుంది. 

35
సహాయం కాస్తా డిమాండ్ గా మారిపోతుంది

అందుకే మంచితనం ఎప్పుడు ఇబ్బంది అవుతుందంటే... ఆ మంచి మన మీదకే రివర్స్ అయినప్పుడు. ఎవరికి సహాయం చేస్తున్నామని ముందు తెలుసుకోవాలి. లేకపోతే ప్రతీసారి సహాయం చేసే పాటికి అభ్యర్థన కాస్తా హక్కు, డిమాండ్ గా మారిపోతుంది. ఇలాంటి వారికి అసలు సహాయం చేయకపోవడమే మంచిది.

45
సైకాలజీలో 2 కారణాలు

అసలు ఇంత సహాయం చేయడం, అతి మంచితనానికి సైకాలజీలో 2 కారణాలు ఉన్నాయి. కారణం ఉంది. అందులో మొదటిది ఫియర్ ఆఫ్ రిజక్షన్. ఇది ఎందుకు వస్తుందంటే...దయ, అతి మంచితనం వల్ల. దయ ఉంటే పర్లేదు. కానీ అతి మంచితనం పనికిరాదు. అందరినీ సంతోషపెట్టాలని నిన్ను నువ్వు కోల్పోతావని సైకాలజిస్టులు చెబుతున్నారు. నీ సాయం అలవాటు కాకూడదు. 

55
నిస్సహాయ స్థితికి చేరిపోయే ప్రమాదం

ఇక రెండోది ఫియర్ ఆఫ్ కాన్ ఫ్లిక్ట్. ఎదుటివారి దగ్గర మంచితనం అనిపించుకోవాలని చెప్పి సహాయం చేస్తూనే ఉంటారు. ఒకవేళ సహాయం చేస్తే గొడవలు వస్తాయనే భయంతో చేసేస్తుంటారు. అలా సహాయం చేసుకుంటూ పోతే కచ్చితంగా ఇబ్బంది పడతారని సైకాలజిస్టులు అంటున్నారు. చివరకు నిస్సహాయ స్థితికి చేరిపోయే ప్రమాదం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories