Jasmine Flowers: మల్లెపూలు ఫ్రిజ్ లో పెట్టినా కూడా తాజాగా ఉండట్లేదా? వెంటనే వాడిపోతున్నాయా? నల్లగా మారిపోతున్నాయా? అయితే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. రెండు వారాలు అయినా ఈ మల్లె పూలు ఫ్రెష్ గా ఉంటాయి.
ఎండాకాలం వచ్చింది అంటే చాలు మార్కెట్లోకి మల్లెపూలు వచ్చేస్తాయి. ఇక.. మల్లెపూలు అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ ఈ పూలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. చెట్టు నుంచి కోసిన గంటలోపే వాడిపోతాయి. రంగు మారిపోతాయి. మార్కెట్ నుంచి కొన్న మల్లెపూలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు..
24
నీటిని చిలకరించడం (Water Mist)
పూలు ఇంటికి తెచ్చిన వెంటనే వాటిపై కొద్దిగా చల్లటి నీళ్లు చిలకరించండి. గుర్తుంచుకోండి, నీళ్లు మరీ ఎక్కువగా ఉండకూడదు, కేవలం తేమ ఉంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పూలు త్వరగా ఎండిపోకుండా ఉంటాయి.
34
గాలిచొరని డబ్బాల వాడకం (Air-tight Containers)
మల్లెపూలను ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాలో వేసి, గాలి చొరబడకుండా మూత గట్టిగా పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. దీనివల్ల బయటి గాలి తగలకుండా పూలు త్వరగా రంగు మారవు. వాటి సువాసన కూడా తాజాగా అలానే ఉంటుంది.
మీ దగ్గర డబ్బాలు లేకపోతే జిప్‌లాక్ బ్యాగులను కూడా వాడొచ్చు. పూలను బ్యాగులో వేసిన తర్వాత, లోపల కొద్దిగా గాలి ఉండేలా చూసుకొని సీల్ చేయండి. ఇలా చేస్తే పూల రెక్కలు నలిగిపోకుండా ఉంటాయి.
మల్లెపూలను నేరుగా ఎండ తగిలే చోట లేదా వేడిగా ఉండే ప్రదేశాల్లో అస్సలు పెట్టకండి. ఎప్పుడూ చల్లగా, నీడగా ఉండే చోట పెడితేనే అవి ఎక్కువ కాలం తాజాగా వికసించి ఉంటాయి.
ఒకవేళ మీ ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే, ఓ కాటన్ గుడ్డను తడిపి (నీళ్లన్నీ పూర్తిగా పిండేయాలి) అందులో పూలను చుట్టి పెట్టండి. లేదా మన పాత పద్ధతి ప్రకారం అరటి ఆకులో చుట్టి పెట్టినా మల్లెపూలు తాజాగా ఉంటాయి.