గర్భంతో ఉన్నప్పుడు ఈ పండ్లను తప్పక తినండి.. బిడ్డ, మీరు ఆరోగ్యంగా ఉంటారు..

First Published Sep 27, 2022, 1:54 PM IST

గర్భిణులకు పండ్లు చాలా అవసరం. పండ్ల ద్వారా కడుపులోని పిండం ఎదుగుదలకు, తల్లి ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. 

Health tips

పండ్లు పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ చాలా మంది పండ్లను నెలకో రెండు నెలలకో తింటుంటారు. ఇతరుల సంగతి పక్కన పెడితే.. గర్భిణులు మాత్రం ఈ పండ్లను తప్పకుండా తినాలి. ఎందుకంటే వీటి ద్వారా బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ పండ్లు గర్భిణులు చాలా అవసరం. గర్భంతో ఉన్నప్పుడు ఎలాంటి పండ్లను తినాలో తెలుసుకుందాం పదండి. 

ఆరెంజ్

ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా సహాయపడతాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ బి బిడ్డకు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంటే వెన్నెముక, మెదడుకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. అందుకే గర్భిణులు వీటిని తప్పకుండా తినాలి. 
 

మామిడి

మామిడి పండ్లు ఒక్క వేసవిలోనే లభిస్తాయి. ఈ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భిణులకు.. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి లు బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే  ఎన్నో అనారోగ్య సమస్యల ముప్పును కూడా తప్పిస్తాయి. ఈ పండ్లు పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి. 
 

నిమ్మకాయ

సిట్రస్ ఫ్రూట్ అయిన నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణుల్లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు జీర్ణక్రియ పనితీరుకును కూడా మెరుగుపరుస్తుంది. అందులోనూ నిమ్మకాయ రసం తాగడం వల్ల గర్భిణుల్లో వాంతులు, వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి. గర్భిణులకు లెమన్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది. 

అరటిపండు

రోజుకో అరటిపండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదం తప్పుతుందంటారు ఆరోగ్య నిపుణులు. ఈ పండులో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, విటమిన్ బి6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణులు ఈ పండ్లను తినడం వల్ల  వాంతులు, వికారం తగ్గుతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 
 

యాపిల్ 

రోజుకో యాపిల్ పండున తింటే డాక్టర్ వద్దకు వెల్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఈ పండులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పెక్టిన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీనిని తొక్క తీసి కాకుండా తొక్కతో సహా తినడమే మంచిది. కడగడం మాత్రం మర్చిపోకూడదు. 
 

బెర్రీలు

బెర్రీల్లో పుష్కలంగా ఉండే ఫోలేట్, విటమిన్ సి, ఫైటో న్యూట్రియంట్స్, ఫైబర్ , కార్భోహైడ్రేట్లు కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తల్లికి శక్తినిస్తాయి. వీటిని అలాగే లేదా స్మూతీగా చేసుకుని తీసుకోవచ్చు. ఇందుకోసం బ్లూ బెర్రీ, రాస్ బెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రా బెర్రీలను తినొచ్చు. కానీ రోజూ వీటిని మోతాదులో తినడం ఆరోగ్యకరం. 
 

అవకాడో

అవకాడోలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని గర్భిణులు తప్పకుండా తినాలి. వీటిలో విటమిన్ సి, విటమిన్ బి, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె, మెగ్నీషియం పుష్కలంగా ఉంటారుు. ఇవి గర్భిణుల్లో కాళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

click me!