వీళ్లు పొరపాటున కూడా మెంతులను తినకూడదు..

First Published Sep 27, 2022, 12:43 PM IST

మెంతులు కాస్త చేదుగా ఉన్నా.. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. కానీ మెంతులు కొన్ని అనారోగ్య సమస్యలున్న వారికి అస్సలు మంచివి కావు. 
 

మెంతుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. కానీ ఇవి కాస్త చేదుగా ఉంటాయి. అందుకే కొంతమంది అస్సలు తినరు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు మాత్రం ఖచ్చితంగా తింటుంటారు. మెంతులను క్రమం తప్పకుండా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. రోగాలొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 
 

మెంతుల్లో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, కార్భోహైడ్రేట్లు,మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. ఇవి ఓవర్ వెయిట్, బ్లడ్ షుగర్ లెవెల్స్, అధిక రక్తపోటు వంటి సమ్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ మెంతివాటర్ ను తాగడం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. బరువు కూడా ఫాస్ట్ గా తగ్గుతారు. మలబద్దకం నుంచి బయటపడతారు. పీరియడ్స్ నొప్పి, సమస్యలు కూడా తగ్గిపోతాయి. మెంతులు మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ మెంతులు అజీర్థి, కడుపు ఉబ్బరం, వాపు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. అయినప్పటికీ మెంతులను కొంతమంది అస్సలు తినకూడదు. వాళ్లెవరో తెలుసుకుందాం పదండి.

గర్భిణులు

గర్భిణులు మెంతులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ గింజలు గర్భిణుల్లో జీర్ణక్రియ సమస్యలను పుట్టిస్తాయి. ముఖ్యంగా ఈ గింజలు కడుపులో పెరుగుతున్న పిండంపై చెడు ప్రభావాన్ని చూపెడుతాయి. అంటే బిడ్డకు వైకల్యం వచ్చే అవకాశం ఉంది. అందుకే గర్భిణులు మెంతులను అస్సలు తీసుకోకూడదు. 

శ్వాసకోశ సమస్య

మెంతులను తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వదిలిపోతాయి. కానీ శ్వాస కోస సమస్యలున్నవారు మాత్రం తీసుకోకూడదు. దీనికోసం మీరు  మందులు వాడుతున్నట్టేతే.. పొరపాటున కూడా మెంతులను తీసుకోకండి. ఎందుకంటే ఈ గింజలు మెడిసిన్స్ పై ఎఫెక్ట్ చూసిస్తాయి. అంటే ఈ ట్యాబ్లెట్స్ మీ సమస్యను తగ్గించకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

అధిక రక్తపోటు

అధిక రక్తపోటు తో బాధపడేవారు కూడా మెంతులను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ గింజలు బీపీని మరింత పెంచుతాయట. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎంచక్కా తీసుకోవచ్చు. కానీ హైబీపీ పేషెంట్లు మాత్రం ఈ గింజలకు దూరంగానే ఉండాలి. పిల్లలకు కూడా మెంతులను పెట్టకూడదు. 
 

click me!