Pregnancy Tips: గర్భిణులు గ్రీన్ టీ తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమౌతుంది..

Published : Jun 23, 2022, 12:37 PM IST

Pregnancy Tips: గర్భం దాల్చిన మొదటి నెల నుంచి గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో. అయితే గర్భిణులకు గ్రీన్ అస్సలు మంచిది కాదు. దీనివల్ల బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. 

PREV
16
 Pregnancy Tips: గర్భిణులు గ్రీన్ టీ తాగొచ్చా? ఒకవేళ తాగితే ఏమౌతుంది..

గర్భధారణ నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు.. మహిళలు ప్రతి దశలోనూ జాగ్రత్తగా ఉండాలి. తినడం, మందులు వేసుకోవడం, వ్యాయామం చేయడం అంటూ ప్రతి దాంట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో.. గర్భిణులు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తల్లులు తీసుకునే ఆహారమే బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు సహాయపడుతుంది. అందుకే వీరు తీసుకునే ఆహారం బిడ్డకు మంచిదా? కాదా? అన్న విషయాలను తెలుసుకోవాలి. 

26

అయితే కొంతమంది గర్భిణులు గ్రీన్ టీ తాగుతుంటారు. వాస్తవానికి గ్రీన్ టీ వల్ల గర్భిణులో ఉన్న బిడ్డకు నష్టం వాటిల్లుతుంది. అయితే కొంతమంది ఇది సురక్షితమైనదని అనుకుంటారు. దీనిలో ఏది నిజమో? ఏది కాదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..  

36

గర్భిణీ స్త్రీలు సాధ్యమైనంత వరకు కెఫిన్ కలిగిన ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహానిస్తుంటారు. కెఫిన్ వల్ల శరీరం నిర్జలీకరణానికి (dehydration) గురవుతుంది. అందుకే చాలా మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగరు. అయినప్పటికీ.. గ్రీన్ టీ బహుళ పోషకాలతో నిండి ఉంటుంది. అందుకే చాలా మంది తమకు కావలసినంత తాగొచ్చని అనుకుంటారు. ఈ ఆలోచన పూర్తిగా తప్పు. 

46

ముందుగా గ్రీన్ టీ హెర్బల్ టీ కాదని గుర్తుంచుకోవాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది కామెల్లియా సినెన్సిస్ అని పిలువబడే మొక్క ఆకుల నుంచి తయారు చేయబడుతుంది. దీనిలో బహుళ పోషకాలుంటాయి. అయినప్పటికీ గ్రీన్ టీని ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. 

56

చాలా సందర్భాల్లో గ్రీన్ టీ గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరం. ఇది శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ స్థాయిని తగ్గిస్తుంది. అందుకే గర్భందాల్చిన మొదటి మూడు నెలలు దీనిని అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ అస్సలు తాగకూడదు. ఇది బిడ్డకు హాని కలిగిస్తుంది. అయితే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తల్లికి చాలా అవసరం. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దానితో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
 

66

ప్రెగ్నెన్సీ తర్వాత ప్రతి మహిళ శరీరం మారుతుంది. ఈ మార్పు అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ డాక్టర్ సలహాను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లే..  కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అందుకే ముందుగా వైద్యుడిని సంప్రదించండి. అలాగే గ్రీన్ టీ ని రెండు కప్పుల కంటే ఎక్కువగా అస్సలు తాగకూడదు. 

Read more Photos on
click me!

Recommended Stories