ప్రెగ్నెన్సీ టైంలో ముక్కు పెద్దగైతదా?

First Published Jan 21, 2023, 5:06 PM IST

గర్భాధారణ సమయంలో ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. అందులో ముక్కు కూడా ఒకటి. అవును ప్రెగ్నెన్సీ సమయంలో ముక్కు కూడా ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే.. 
 

గర్భధారణ సమయంలో ఆడవారి శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. ఈ సమయంలో ఆడవాకి వక్షోజాలు పెద్దవిగా, బరువుగా, మృదువుగా మారతాయి. అలాగే ఎక్కువ మూత్ర విసర్జన కూడా చేయాల్సి వస్తుంది. ఇవందరికీ తెలుసు. కానీ గర్భధారణ సమయంలో ముక్కు కూడా ప్రభావితమవుతుందన్న ముచ్చట చాలా తక్కువ మందికే తెలుసు. సోషల్ మీడియాలో కాబోయే తల్లులు మాట్లాడుకుంటున్న విషయం ఇది. అవును చాలా మంది గర్భధారణ సమయంలో ముక్కు ఎలా ప్రభావితమవుతుందనే దానిపై వీడియోలను పంచుకుంటున్నారు. ఈ వీడియోల్లో పెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ తర్వాత ముక్కు ఆకృతిని చూపిస్తారు. అసలు గర్భాధారణ సమయంలో ముక్కు ఎలా ప్రభావితమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గర్భధారణ రినిటిస్ గురించి వినే ఉంటారు. ఇందులో ముక్కు కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ముక్కు దిబ్బడ సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది. గర్భధారణ ముక్కు అనేది గర్భధారణ సమయంలో శరీరంలో మరొక మార్పు. దీని గురించి చాలా మంది ఆడవారు చెప్తుంటారు. 
 

pregnancy

గర్భధారణ ముక్కు అంటే ఏమిటి?

ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. కానీ కొత్తగా కాబోయే తల్లుల మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఒక నిర్దిష్ట మార్పు సాధారణమా? కాదా?  అనేది. అలాగే కడుపులో శిశువు కదలికలు కూడా సాధారణమైనవా?  కావా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. మహిళల శరీరం మొదటి త్రైమాసికం నుంచి మూడవ త్రైమాసికం వరకు ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఈ మార్పులు ప్రసవానంతర దశ వరకు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రగ్నెన్సీ సమయంలో ముక్కు పెద్దదిగా మారుతుంది. ఇది కూడా సాధారణ మార్పేనంటున్నారు నిపుణులు. 
 

గర్భధారణ ముక్కుకు కారణం? 

గర్భం దాల్చిన మొదటి త్రైమాసికం, రెండో త్రైమాసికం ప్రారంభం నుంచి పెరుగుతున్న పిండానికి అనుగుణంగా రక్త నాళాలు విస్తరిస్తాయని నిపుణులు అంటున్నారు. మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు మీ ముక్కు కింద శ్లేష్మ పొరలోకి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. రక్త సరఫరా పెరగడం వల్ల మీ ముక్కులోని కండరాలు, పొరలు విస్తరిస్తాయి. దీంతోమీ ముక్కు పరిమాణం కూడా పెరుగుతుంది. మూడవ లేదా చివరి త్రైమాసికంలో..  కొంతమంది మహిళల ముఖం ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. అంటే వీరి ముఖంలో నీరు ఎక్కువవుతుంది. ఇది ముక్కు వాపుకు దారితీస్తుంది.
 

pregnancy

గర్భధారణ ముక్కు.. సాధారణం కాదు

నిజానికి గర్భందాల్చిన ప్రతి ఒక్కరికీ ముక్కు పెద్దగా ఉండదు. కొంతమంది మహిళలకు మాత్రమే ఇలా అవుతుంది. అయితే కొంతమంది మహిళల ముక్కు రంగు మారొచ్చు. అంటే ముక్కు రంగు ఎర్రగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంలోని పిగ్మెంటేషన్ ను ప్రభావితం చేసే హార్మోన్ల స్థాయిలు మారడం వల్ల ఇలా జరుగుతుంది.
 


ముక్కు సాధారణంగా ఎప్పుడు అవుతుంది

డెలివరీ అయిన తర్వాత మాత్రమే మీ ముక్కు తిరిగి నార్మల్ గా మారుతుంది. మీ హార్మోన్లు నార్మల్ గా అయిన తర్వాత మీ శరీరం నార్మల్ గా మారుతుంది. 

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో జరిగే ఇతర మార్పులు

గర్భధారణ సమయంలో మహిళల శారీరంలో మార్పులు మాత్రమే కాదు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారికి విరేచనాలు అవుతాయి. 
వికారంగా అనిపించొచ్చు
మానసిక స్థితిలో మార్పులు వస్తాయి 
మీ వక్షోజాల సైజులో మార్పు వస్తుంది 
తలనొప్పి తరచుగా వస్తుంది
నడుము కింది భాగంలో నొప్పి, ఇబ్బందిగా ఉంటుంది
పాదాల వాపు కూడా ఉంటుంది
తరచుగా మూత్ర విసర్జనకు వెళ్ళొచ్చు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 
 

click me!