జుట్టు చివర్లను కట్ చేస్తే.. ఫాస్ట్ గా పెరుగుతుందా? దీనిలో నిజమెంతంటే..?

First Published Jan 21, 2023, 4:04 PM IST

చాలా మంది జుట్టును కట్ చేస్తే పొడుగ్గా పెరుగుతుందని అనుకుంటారు. ఇందుకోసం కొంతమంది నెలకోసారి కట్ చేస్తే.. ఇంకొంతమంది మాత్రం మూడు నాలుగు నెలలకు ఒక సారి కట్ చేస్తూ ఉంటారు. అయితే కట్ చేసినంత మాత్రాన జుట్టు పెరుగుతుందనడంలో నిజముందా? 
 

పొడవైన, అందమైన, నల్లని కురులను కోరుకోని వారు అస్సలు ఉండరు కదా. కానీ ఈ రోజుల్లో జుట్టు సమస్యలు ఎక్కువైపోయాయి. వాతావరణ కాలుష్యం, కెమికల్స్ షాంపూలు, నూనెలు, డీహైడ్రేషన్, అనారోగ్యకరమైన ఆహారం వల్ల చాలా మంది  జుట్టు సమస్యలను ఫేస్ చేస్తున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, డ్రై నెస్, జుట్టు పగిలిపోవడం, రఫ్ గా మారడం వంటి సమస్యలతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే జుట్టు చివర్లను కొద్దిగా కట్ చేస్తే పొడుగ్గా పెరుగుతుందని భావించే వారు చాలా  మందే ఉన్నారు. నిజంగా కట్ చేస్తే జుట్టు పెరుగుతుందా..
 

నెలకు లేదా రెండు మూడు నెలలకు ఒకసారి జుట్టును ఖచ్చితంగా కట్ చేసే వారు చాలా మందే ఉన్నారు. ఇలా కట్ చేస్తే జుట్టు పొడుగ్గా పెరుగుతుందని చెప్తుంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జుట్టును కట్ చేసినంత మాత్రాన అది అస్సలు పెరగదు. జుట్టు పెరగడం అనేది కేవలం మన అపోహేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 
 

జుట్టును కత్తిరిండానికి, దాని పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని నిపుణులు తేల్చేసారు. ఎందుకో తెలుసా? వెంట్రుకలు కుదుళ్ల నుంచి మాత్రమే పెరుగుతాయి. అంటే నెత్తిమీద చర్మం నుంచి. అదే జుట్టు చివర్ల నుంచి కాదు. అందుకే జుట్టును కత్తిరించడం వల్ల అవి పొడుగ్గా, ఆరోగ్యంగా పెరుగుతాయనుకోవడం పెద్ద అపోహే అవుతుంది. 


నిజానికి జుట్టును కత్తిరించుకోవవడం వల్ల జుట్టు అందంగా కనిపిస్తుంది. అంతే చక్కటి షేప్ వస్తుంది. మీకు తెలుసా మన జుట్టు నెలకు 1 సెం.మీ వేగంతో పెరుగుతుంది. అయితే జుట్టు అప్పుడప్పుడు దెబ్బతింటుంది కూడా. అలాగే రోజుకు మన వెంట్రుకలు 50 నుంచి 100 వరకు ఊడిపోవడం చాలా సహజం. వెంట్రుకల జీవితకాలం అయిపోగానే అవి రాలిపోయి కొత్తవి పుట్టుకొస్తాయి. అయితే చివర్లను కత్తిరించడం వల్ల దెబ్బతిన్న జుట్టు తొలగిపోతుంది. జుట్టు అందంగా మారుతుంది. 

hair cutting

అయితే జుట్టును కత్తిరించుకోకూడదా? 

హెయిర్ కట్టింగ్ కు, పెరుగుదలకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ట్రిమ్మింగ్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మీరు పొడవాటి అందమైన జుట్టును కోరుకుంటే మాత్రం ఇది చాలా చాలా ముఖ్యం. పగిలిన, దెబ్బతిన్న జుట్టును కత్తిరించడం వల్ల  మీ జుట్టు ఆరోగ్యంగా, మందంగా కనిపించడానిక సహాయపడుతుంది. 
 

జుట్టును ఎన్నిరోజులకు కత్తిరించాలి? 

జుట్టును కత్తిరించడం వల్ల అది ఆరోగ్యంగా పెరుగుతుంది సరే.. కానీ జుట్టును ఎన్ని రోజులకు కట్ చేస్తే మంచిది? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్రమం తప్పకుండా జుట్టును ట్రిమ్ చేయడం మీ జుట్టు సంరక్షణలో భాగం కావాలి. ఎందుకంటే దీనివల్ల జుట్టు సమస్యలు రావు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ ఫ్రీక్వెన్సీ మీ జుట్టు రకం, హెయిర్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది. మీకు మంచి  ఆకృతి ఉన్న జుట్టు ఉంటే వాటిని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడానికి మీరు ప్రతి 2 నుంచి 3 నెలలకు ఒకసారి కత్తిరించండని నిపుణులు చెబుతున్నారు. 
 

అయితే జుట్టును ఎప్పుడు కత్తిరించాలనే దానిపై ఎలాంటి నియమం లేదు. కానీ మీరు వాటిని ఎంతకాలం కోరుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు 3-4 నెలలకు ఒకసారి జుట్టును కత్తిరించొచ్చు. ఏదేమైనా మీరు ఎంత జుట్టును కత్తిరించినా అది తిరిగి పెరుగుతుంది. 

click me!