Health Tips : ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి జనాలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. అంతేకాదు పండ్లు, కూరగాయలను తినే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. కానీ మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోకతప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని జనాలు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. పండ్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా.. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. ఇక అన్ని పండ్లలో దానిమ్మ పండు ఎన్నో పోషకవిలువలను కలిగి ఉంటుంది.
29
ఈ పండును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ ట్యూమర్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్ లు కూడా ఉంటాయి.
39
నిత్యం దానిమ్మ పండు లేదా జ్యూస్ ను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మధుమేహం, అధిక రక్తపోటు ను నియంత్రించడంతో పాటుగా ఎన్నో వ్యాధులను కూడా తగ్గిస్తుంది. అలాగే పిల్లల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దానిమ్మ పండు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
49
గర్భిణీ స్త్రీలు కూడా దానిమ్మను తినాలని వైద్యులు సలహానిస్తుంటారు. దానిమ్మలో ఐరన్ కంటెంట్ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. చాలా మంది దానిమ్మ గింజలను తినేకంటే రసాన్ని తాగడానికే ఇష్టపడతారు.
59
ఉదయం బ్రేకఫాస్ట్ తో పాటుగా ఒక గ్లాసు దానిమ్మ రసం తాగే వారు కూడా ఉన్నారు. దానిమ్మ ఆరోగ్యానికి మంచి చేసేదే అయినా.. వాటిని మరీ ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానిమ్మను అధికంగా తీసుకుంటే మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
69
దానిమ్మను ఎక్కువగా తినడం వల్ల దగ్గు, అలర్జీలు మొదలైన సమస్యలతో పాటుగా ఎన్నో వ్యాధులొచ్చే అవకాశం ఉంది. మరి దానిమ్మ పండు లేదా దానిమ్మ జ్యూస్ ను ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
79
దగ్గు.. దానిమ్మ పండును మోతాదులో తీసుకుంటేనే మన ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అలా అని మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం దగ్గు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దానిమ్మ పండులో గొంతునొప్పికి దారితీసే పదార్థాలుంటాయి. దానిమ్మ పండును ఎక్కువగా తింటే గొంతునొప్పితో పాటుగా దగ్గు సమస్య కూడా వస్తుంది.
89
స్కిన్ అలెర్జీ.. దానిమ్మ ను మితంగా తీసుకుంటే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్నికాపాడటంతో పాటుగా కాంతివంతంగా కూడా చేస్తుంది. అంతేకాదు దానిమ్మ స్కిన్ టోనర్ గా కూడా పనిచేస్తుంది. అయితే దీన్ని మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అలెర్జీ సమస్య వచ్చే అవకాశం ఉంది. దానిమ్మను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల శరీరంపై ఎర్రని దద్దుర్లు వస్తాయి. అలాగే అలెర్జీ కూడా వస్తుంది.
99
ఎసిడిటీ.. దానిమ్మ పండును అధికంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీకి దారితీస్తుంది. శరీరానికి వేడి లేదా చల్లని పదార్థాలను ఇచ్చినప్పుడు దానికి సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారుతుంది. దానిమ్మ శరీరానికి చలువ చేస్తుంది. దానిమ్మను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య బారిన పడతారు. కాబట్టి ఈ పండును మోతాదులోనే తినండి.