diabetes: ఈ కూరగాయలు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి.. వెంటనే డైట్ లో చేర్చుకోండి..

Published : May 11, 2022, 03:57 PM ISTUpdated : May 11, 2022, 03:59 PM IST

diabetes: డయాబెటీస్ పేషెంట్లు తాము తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. అయితే మధుమేహులు ఈ మూడు కూరగాయలను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

PREV
18
diabetes: ఈ కూరగాయలు షుగర్ లెవెల్స్  ను కంట్రోల్ చేస్తాయి.. వెంటనే డైట్ లో చేర్చుకోండి..

ప్రపంచ దేశాలతో పాటుగా భారతదేశంలో కూడా డయాబెటీస్ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.  దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులోనూ మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహులు తమ రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడం చాలా కష్టంగా మారింది. 

28
diabetes

వాస్తవానికి చెడు ఆహారపు అలవాట్ల వల్లే డయాబెటీస్ ఎక్కువగా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా డయాబెటీస్ సోకిన తర్వాత తగ్గడమంటూ ఉండదు. షుగర్ లెవెల్స్ ను నియంత్రించడం తప్ప. అయితే షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి ఈ మూడు కూరగాయలు ఎంతో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

38

క్యారెట్లు.. క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. క్యారెట్ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదు క్యారెట్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇవి శీతాకాలంలో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. 

48

క్యాబేజీ.. క్యాబేజీ డయాబెటీస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి క్యాబేజీ లో పిండి పదార్థ పరిమాణం చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. లీఫ్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని కూరగా లేదా.. సలాడ్ రూపంలో తీసుకున్నా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ క్యాబేజీని బంగాళాదుంప. ఇతర కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

58

దోసకాయ.. దోసకాయలో 90 శాతం నీరుంటుంది. ఈ వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల మీ శరీరం హైడ్రేటెగ్ గా ఉండటంతో పాటుగా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది శరీరంలో నీటి కొరత లేకుండా చేస్తుంది. దీన్ని డయాబెటీస్ పేషెంట్లు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. 

68

డయాబెటీస్ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో 400 నుంచి 500 గ్రాముల కూరగాయలు ఉండేట్టు చూసుకోవాలి. అలాగే చిరుధాన్యాలను కూడా తింటూ ఉండాలి. రోజూ ఒకే రకమైనవి కాకుండా కొన్నింటిని కలిపి తీసుకోండి. 

78
fiber

డయాబెటీస్ పేషెంట్లకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అన్నాన్ని తక్కువగా తీసుకుని రాగులు, కొర్రలు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలను తినండి. 

88

అలాగే కీరదోస, టొమాటోలు, క్యారెట్ , బీట్ రూట్ వంటి కూరగాయలను ఉడికించకుండా పచ్చిగానే తినడం అలవాటు చేసుకోండి. అంతేకాదు బ్రేక్ ఫాస్ట్ లో ఉదయం ఏదైనా కూరగాయల జ్యూస్ ను తాగండి. ఇక మధ్యాహ్నం సమయంలో కూరగాయల సలాడ్, రాత్రి పండ్లను తీసుకోండి.  ఇలా చేస్తే మీరు పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకోలేరు. దీంతో ఆటోమెటిక్ గా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

click me!

Recommended Stories