Top 5 Places in Goa : గోవా అనగానే బీచ్‌లు మాత్రమే కాదు, అద్భుతమైన పోర్చుగీస్ కట్టడాలు, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. దిల్ చాహ్తా హై కోట నుండి క్వీన్ ఆఫ్ బీచ్ వరకు.. గోవాలో చూడాల్సిన టాప్ స్పాట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
దిల్ చాహ్తా హై కోట నుండి క్వీన్ ఆఫ్ బీచ్ వరకు.. గోవాలో చూడాల్సిన టాప్ స్పాట్స్!
బాలీవుడ్ సినిమాల్లో చూపించే ఆ అందమైన నీలి రంగు సముద్రం, బంగారు వర్ణంలో మెరిసిపోయే ఇసుక తిన్నెలు, పురాతన పోర్చుగీస్ కట్టడాలు చూస్తుంటే ఎవరికైనా ఒక్కసారైనా గోవా వెళ్లాలనిపిస్తుంది. మీరు సినిమా పిచ్చోడైనా, అడ్వెంచర్ లవర్ అయినా, ఫుడీ అయినా లేదా పార్టీ అనిమల్ అయినా.. గోవాలో అందరికీ నచ్చే ఏదో ఒక విషయం కచ్చితంగా ఉంటుంది. బీచ్‌లు, సీఫుడ్ మాత్రమే కాదు, ఇక్కడి సంస్కృతి, ఆధ్యాత్మికత కూడా మిమ్మల్ని ఫిదా చేస్తాయి. మరి గోవా వెళ్తే అస్సలు మిస్ అవ్వకూడని 5 ప్లేసెస్ ఏంటో తెలుసా?
26
1. ఫోర్ట్ అగ్వాడా
17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఫోర్ట్ అగ్వాడా, పోర్చుగీస్ నిర్మాణ శైలికి ఒక నిలువెత్తు నిదర్శనం. పంజిమ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో సింక్వెరిమ్ బీచ్ వద్ద ఇది ఉంది. ఇక్కడ మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఆసియాలోనే అత్యంత ప్రత్యేకమైన నాలుగు అంతస్తుల లైట్‌హౌస్ ఇక్కడ ఉంది.
పోర్చుగీస్ భాషలో అగ్వా అంటే నీరు అని అర్థం. పూర్వం నావికులకు మంచి నీరు అందించే స్టోరేజ్ పాయింట్‌గా ఇది పనిచేసేది. ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి రిజర్వాయర్లలో ఇది ఒకటి కావడం విశేషం. సాయంత్రం వేళ మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఇక్కడ సన్ సెట్ చూస్తే ఆ కిక్కే వేరు.
36
2. కలంగుట్ బీచ్
నార్త్ గోవాలో అత్యంత పొడవైన, ఫేమస్ బీచ్ కలంగుట్. కండోలిమ్ నుండి బాగా బీచ్ వరకు విస్తరించి ఉండే ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ బీచ్‌స్ అని పిలుస్తారు. ప్రపంచంలోని టాప్ 10 రిక్రియేషనల్ బీచ్‌లలో దీనికి చోటు దక్కింది.
ఇక్కడ లైఫ్ చాలా వైబ్రంట్‌గా ఉంటుంది. బీచ్ షాక్స్, క్లబ్స్, వెరైటీ సీఫుడ్, కాక్టెయిల్స్‌తో ఈ ఏరియా ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మీకు అడ్వెంచర్ అంటే ఇష్టమా? అయితే ఇక్కడ పారాసెయిలింగ్, వాటర్ సర్ఫింగ్, బనానా రైడ్స్, జెట్ స్కీయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ అస్సలు మిస్ అవ్వకండి.
గోవా వెళ్లినప్పుడు క్రూయిస్ ప్రయాణం చేయకపోతే మీ ట్రిప్ పూర్తికానట్టే. మాండవి నదిపై సాగే ఈ ప్రయాణం మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవెనింగ్ క్రూయిజ్‌ల నుండి లగ్జరీ డిన్నర్ క్రూయిజ్‌ల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి.
కపుల్స్ కోసం రొమాంటిక్ డిన్నర్ క్రూయిజ్‌లు, పోకర్ ఆడేవారి కోసం క్యాసినో క్రూయిజ్‌లు ప్రత్యేకంగా ఉంటాయి. సన్ సెట్ లేదా వెన్నెల్లో సాగే ఈ ప్రయాణంలో మ్యూజిక్, డ్యాన్స్, మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మీ టైమ్, బడ్జెట్‌ను బట్టి బెస్ట్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.
56
4. చపోరా ఫోర్ట్: దిల్ చాహ్తా హై కోట
మీరు దిల్ చాహ్తా హై సినిమా చూశారా? అందులో ముగ్గురు స్నేహితులు ఒక కోట గోడ మీద కూర్చుని సముద్రాన్ని చూస్తుంటారు కదా.. అదే ఈ చపోరా ఫోర్ట్. 1717లో పోర్చుగీసు వారు దీనిని నిర్మించారు. అంతకుముందు దీనిని షాపురా కోట అని పిలిచేవారు.
చపోరా నది పక్కనే ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఇక్కడి నుండి వాగటర్ బీచ్, అరేబియా సముద్రం కనిపిస్తాయి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. సాయంత్రం పూట ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న ట్రెకింగ్ చేసి ఇక్కడికి వెళ్తే, సెల్ఫీలకు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ దొరుకుతుంది.
66
5. బాసిలికా ఆఫ్ బామ్ జీసస్
గోవా అంటే కేవలం పార్టీలే కాదు, అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. ఓల్డ్ గోవాలోని బాసిలికా ఆఫ్ బామ్ జీసస్ చర్చిని ప్రతి ఏటా వేలమంది భక్తులు సందర్శిస్తారు. 16వ శతాబ్దానికి చెందిన ఈ చర్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పార్థివ దేహం భద్రపరిచారు.
దీని నిర్మాణ శైలి చాలా బాగుంటుంది. మొజాయిక్ మార్బుల్ టైల్స్, విలువైన రత్నాలతో కూడిన ఫ్లోరింగ్ దీనికి పురాతన కళను తెచ్చిపెట్టింది. చర్చి లోపల ఉండే కళాఖండాలు, జెసూట్ ఇన్సిగ్నియా వంటి గుర్తులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. గోవా చరిత్రను తెలుసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.