సాధారణంగా చాలా మంది ఇంట్లో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, చిలుకలు లాంటి వాటిని ప్రేమగా పెంచుకుంటారు. ఈ పెంపుడు జంతువులను ఎక్కువగా ముద్దు చేస్తారు. ముద్దులతో ముంచెత్తుతారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది తమ పెంపుడు జంతువులను తమతో పాటే పడుకోబెట్టుకుంటారు. వారికి, వారి పెంపుడు జంతువులకు మధ్య ప్రేమ, అనుబంధం ఆ స్థాయిలో ఉంటుంది.
పెంపుడు జంతువులకు ముద్దు పెట్టడం మంచిదేనా?
కొంతమంది పెంపుడు జంతువులతో ఆడుకుంటూ, మాట్లాడుతూ ఉంటారు. మరికొందరు పెంపుడు జంతువుల దగ్గర కూర్చొని ఒంటరితనాన్ని పోగొట్టుకుంటారు. నిజం చెప్పాలంటే చాలామంది మానసిక ఒత్తిడి వారి పెంపుడు జంతువులతోనే తగ్గుతుంది. కానీ పెంపుడు జంతువులకు ముద్దు పెట్టడం మంచిదేనా? దాని వల్ల కలిగే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
బ్యాక్టీరియా:
జంతు నిపుణుల ప్రకారం పెంపుడు జంతువులపై చాలా రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. పెంపుడు జంతువుల నోటిలో వేల సంఖ్యలో ఉండే బ్యాక్టీరియాల వల్ల మనుషులకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ముద్దు పెట్టడం:
సాధారణంగా చిన్న పిల్లలకు ముద్దు పెట్టకూడదని చాలామంది డాక్టర్లు చెబుతుంటారు. మన నోటిలోని లాలాజలం పిల్లల చర్మంపై పడి వారికి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే మనం పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకున్నప్పుడు బ్యాక్టీరియాలు మనపై దాడి చేస్తాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. పెంపుడు జంతువులను శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఒకవేళ వాటిని సరిగ్గా చూసుకోకపోతే వాటితో పాటు ఇంట్లో వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
రోగనిరోధక శక్తి:
సాధారణంగా పెంపుడు జంతువులు ఎక్కడపడితే అక్కడ దొర్లుతూ ఉంటాయి. రకరకాలుగా ప్రవర్తిస్తాయి. వీటి వల్ల బ్యాక్టీరియాలు, వైరస్‌లు వ్యాపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెంపుడు జంతువులను తరచుగా ముద్దు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కొంచెం కొంచెంగా తగ్గడం మొదలవుతుంది.
ప్రమాదకరమైన వ్యాధులు
పెంపుడు జంతువులకు ముద్దు పెట్టడం వల్ల ప్లేగు, చిగుళ్ళ వ్యాధి లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా మీ నోటిలో కూడా బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. అందుకే వైద్యులు పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోకూడదని చెబుతుంటారు.
చర్మ సమస్య:
జంతు నిపుణుల ప్రకారం, పిల్లులతో పడుకునే వారికి దురద లాంటి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల కొందరికి దురద, అలర్జీ రావచ్చట.
ఇవి గుర్తుంచుకోండి:
- మీరు ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుతున్నప్పుడు వాటికి సక్రమంగా టీకాలు వేయించండి. దీనివల్ల ప్రమాదకరమైన వ్యాధుల నుంచి అవి రక్షించబడతాయి.
- అలాగే పెంపుడు జంతువులను తరచుగా స్నానం చేయించాలి.