Published : Aug 01, 2025, 09:37 PM ISTUpdated : Aug 01, 2025, 09:38 PM IST
Human Friendly Pets : చాలా జంతువులను మనిషి మచ్చిక చేసుకున్నాడు… కానీ మనకు కుక్క, పిల్లివంటివే పెంపుడు జంతువులుగా తెలుసు. ఇవికాకుండా మరికొన్ని జంతువులు కూడా మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. అలాంటి 7 పెంపుడు జంతువులివే..
మన చుట్టూ చాలా రకాల జంతువులు ఉంటాయి. ప్రతి జంతువుకీ దానిదైన ప్రత్యేక లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. చాలా మందికి జంతువుల్ని పెంచుకోవడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఇష్టం. కొన్ని జంతువులు మనుషులతో చాలా త్వరగా కలిసిపోతాయి. మీరు కూడా అలాంటి జంతువుల్ని పెంచుకోవాలనుకుంటే ఈ జాబితా చూడండి.
DID YOU KNOW ?
పాముల్ని పెంచుకునే గ్రామం
చైనాలో పాములను పెంచుకునే ఓ ఊరు ఉంది. జిసికియావో ప్రజలు కింగ్ కోబ్రా, రస్సెల్స్ వైపర్, రాటిల్ స్నేక్ వంటి అత్యంత విషపూరిత పాములను పెంచుకుంటారు. ప్రతిఏటా ఇక్కడ మూడు మిలియన్ల పాములను పెంచుతారు.
28
1. కుక్క
నమ్మకంగా ఓ స్నేహితుడిలా ఉండే జంతువు కుక్క. ఒకసారి మనతో కలిసిపోతే చాలు... తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మనల్ని కాపాడుతుంది. కుక్కలు చాలా రకాలుగా ఉంటాయి. తమ యజమానులతో ఎక్కడికైనా వెళ్లడం, ఆడుకోవడం వాటికి చాలా ఇష్టం. కొన్ని కుక్కలు సరదాగా పెంచుకునేవి ఉంటాయి... మరికొన్ని రక్షణకోసం పెంచుకునేవి ఉంటాయి.
38
2. పిల్లి
పిల్లులు ఎప్పుడూ స్వేచ్ఛగా తిరగడానికే ఇష్టపడతాయి. కానీ కుక్కల్లాగే అవి కూడా ప్రేమను పంచుకునే జంతువులే. వాటితో ప్రేమగా ఉండే వారితో సమయం గడపడం వాటికి ఇష్టం. ఒకసారి తిండి పెడితే చాలు, మిమ్మల్ని వదిలి వెళ్ళవు. అయితే ఇండియాలో వీటి పెంపకం చాలా తక్కువ… విదేశాల్లో ఎక్కువగా పిల్లులను పెంచుకుంటారు.
చాలా ప్రశాంతమైన జంతువు ఇది. ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఇవి మనుషులతో త్వరగా కలిసిపోతాయి.
58
4. కుందేలు
మనుషులతో బాగా కలిసిపోయే జంతువు కుందేలు. ఇంట్లో, బయట ఎక్కడైనా సరే ఇవి హాయిగా ఉంటాయి. పిల్లలకి కుందేళ్లంటే చాలా ఇష్టం. తెల్లతెల్లగా మెరిసిపోయే కుందేళ్లతో ఆడుకునేందుకు ఇష్టపడతారు.
68
5. చిలుక
కుక్కలు, పిల్లుల్లాగే పక్షుల్ని కూడా ఇంట్లో పెంచుకుంటారు. చిలుకలు కూడా మనుషులతో బాగా కలిసిపోతాయి. యజమానులతో మంచి స్నేహం పెంచుకుంటాయి. ఒకసారి పరిచయం అయ్యాక మీ గొంతు, మీ ఉనికిని బట్టి మిమ్మల్ని గుర్తుపడతాయి. రంగురంగుల చిలుకలను ఇంట్లో పెంచుకోడానికి చాలామంది ఇష్టపడతారు. ఇక మాట్లాడే చిలుకలకు మంచి డిమాండ్ ఉంటుంది.
78
6. గుర్రం
గుర్రాలు మనుషులతో మంచి స్నేహం చేస్తాయి. ఒకసారి కలిసిపోతే మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమగా చూస్తాయి, గుర్తుపెట్టుకుంటాయి. గతంలో దూర ప్రయాణాల కోసం గుర్రాలను వాడేవారు. ప్రస్తుతం సరదాాకోసం, గుర్రపు స్వారీని ఇష్టపడేవారు మాత్రమే పెంచుకుంటున్నారు. కొన్ని అరుదైన గుర్రాలు చాలా ఖరీదు… లక్షలు, కోట్లు విలువచేస్తాయి.
88
7. ఏనుగు
ఏనుగులకి మంచి తెలివితేటలు ఉంటాయి. మనుషులతో కలిసి ఉండడానికి ఇష్టపడే జంతువు ఏనుగు. కొండంత శరీరముండే ఏనుగులు మనుషుల ప్రేమకు ఇట్టే కరిగిపోతాయి… తమ బాగోగులు చూసేవారు ఎలా చెబితే అలా చేస్తుంటారు. కానీ వీటి పోషణ చాలా కష్టంతో కూడుకున్నది. అందుకే వీటిని సాధారణంగా పెంచుకోరు... ప్రత్యేక అవసరాల కోసం పెంచుకుంటుంటారు.