నెలకు రెండు రోజులే రుతుస్రావం అవుతోందా..? కారణాలు ఇవే..

First Published Sep 2, 2022, 2:11 PM IST

కొంతమందికి నెలలో ఐదు రోజులు రుతుస్రావం అయితే మరికొందరికి మాత్రం కేవలం ఒకరోజు లేదా రెండు రోజులు మాత్రమే అవుతుంది. దీనికి కారణాలేంటో తెలుసా.. 
 

నెలకోసారి వచ్చే పీరియడ్స్ టైం ఆడవారికి ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ సమయంలో కొందరికి బాగానే ఉన్నా.. ఇంకొందరికి మాత్రం తీవ్రమైన నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు, మలబద్దకం వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఇకపోతే సాధారణంగా 4 రోజుల నుంచి 8 రోజుల వరకు రుతుస్రావం అవుతుంది. కానీ కొంతమందికి మాత్రం నెలలో ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే రుతుస్రావం అవుతుంది. ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకుందాం పదండి.. 
 

ఒత్తిడి

రుతుస్రావంపై ఒత్తిడి కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతుంది. ఒత్తిడి స్థాయిలు పెరిగితే  రుతుస్రావం కేవలం రెండు రోజులు మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఒత్తిడి మీ హార్మోన్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి తగ్గితే సాధారణ స్థితికి వచ్చేస్తుంది..

కఠినమైన వ్యాయామం

మీరు రోజూ చేసే వ్యాయామం టైం కంటే ఎక్కువసేపు చేయడం వల్ల అండోత్సర్గంను నియంత్రించే హార్మోన్ల విడుదలకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా తక్కువ రోజులు రుతుస్రావం అవుతుంది.
 


కొన్ని రకాల మందులు

రక్తం పలుచబడటానికి, రక్త నియంత్రణ మాత్రలు, స్టెరాయిడ్లు వంటి కొన్ని రకాల మందులను యూజ్ చేయడం వల్ల కూడా తక్కువ రోజులు రుతుస్రావం అవుతుంది. ఎందుకంటే ఈ మందులు రుతుస్రావ కాలాన్ని తగ్గిస్తాయి. దీంతో నెలకు రెండు లేదా మూడు రోజులు మాత్రమే రుతుస్రావం అవుతుంది. 
 

ఇతర వ్యాధులు 

థైరాయిడ్, పిసిఒఎస్, లైంగిక సంక్రమణ వంటి వ్యాధులు కూడా రుతుచక్రానికి ఆటంకం కలిగిస్తాయి. వీటివల్ల రుతుస్రావ కాలం తగ్గుతుంది. 

పేలవమైన అండోత్సర్గము

తక్కువ రోజులు రుతుస్రావం కావడానికి పేలవమైన అండోత్సర్గకు కూడా కారణం కావొచ్చు. ఇది రుతుస్రావం వెనకా ముందు అవడానికి దారితీస్తుంది. 
 

పీరియడ్స్ కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే ఉన్నట్లయితే..

రుతుస్రావం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే అయితే.. మీ శరీరం ఈస్ట్రోజెన్ ను తగినంతగా ఉత్పత్తి చేయడం లేదని అర్థం. కానీ ఇది ఎండోమెట్రియంను నిర్మించడానికి చాలా అవసరం. మీ శరీరంలో ఈస్ట్రోజెన్ లోపిస్తే.. ఎండోమెట్రియం తగినంత మందంగా ఉండదు. అందుకే రక్త ప్రవాహం తక్కువగా ఉంటుంది.

సాధారణ ఋతుచక్రం అంటే.. 

ప్రతి మహిళ పీరియడ్ సైకిల్ వ్యవధి,  స్థిరత్వం పరంగా చాలా భిన్నంగా ఉంటాయి. 4  లేదా 8 రోజుల మధ్య రుతుచక్రాన్ని సాధారణమైనదిగా పరిగణిస్తారు. మీ పీరియడ్స్ అరుదుగా రెండు రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఇవి క్రమం తప్పకుండా ఉండి.. రక్త ప్రవాహం చాలా తేలికగా లేకపోతే.. మీ ఋతుచక్రం 28 నుంచి 40 రోజుల మధ్య ఉండొచ్చు. అయితే సాధారణ రుతుచక్రం 28 రోజులు మాత్రమే ఉండాలి.
 

click me!