ఈ మధ్యకాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగింది. మోకాళ్ల సమస్య బారిన పడటానికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం సరిపడా లేకపోవడమే. నాడీ వ్యవస్థ, ఎముకలు బలంగా , ధ్రుడంగా ఉండటానికి కాల్షియం ఎంతో అవసరం. మన శరీరంలో 90 శాతం కాల్షియం ఉంటుంది. దీనివల్లే మన దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి.
28
పాల ఉత్పత్తుల్లో, బాదం, సాయా బీన్స్, నువ్వులు, వైట్ బీన్స్, నారింజ, గుడ్డు, జున్ను, ఆకుపచ్చ కూరల్లో కాల్షియం మెండుగా ఉంటుంది.
38
డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకవిలువలుంటాయి. అందుకే వైద్యులు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినాలని చెబుతుంటారు. కాగా వీటిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.
48
కాల్షియం ఆకుపచ్చ కూరగాయల్లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ముఖ్యంగా బ్రోకలి,పుదీనా, అరటి, బచ్చలి కూర వంటి కూరగాయల్లో కాల్షియం పెద్ద మొత్తంలో ఉంటుంది. అంతకాదు ఇందులో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది.
58
సోయాబీన్స్, క్యారెట్, క్యాబేజీ వంటి కూరగాయల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. వీటిని మోకాళ్ల నొప్పులున్న వారు వారానికి ఒక సారి తిన్నా వారి శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది.
68
బీన్స్ వంటి పప్పు ధాన్యాలో కాల్షియంతో పాటుగా ఐరన్, పొటాషియం, ప్రోటీన్, జింక్, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం ఫుష్కలంగా ఉంటాయి. వీటిని మోకాళ్ల నొప్పులున్న వారు తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.
78
పాలల్లో కాల్షియ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పాలతో పాటుగా పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, జున్ను, వంటివి మీ రోజు వారి ఆహారంలో తీసుకున్నా కాల్షియం ఎక్కువ మొత్తంలో అందుతుంది.
88
కమల పండ్లు, ఆరెంజ్ పండ్లలో ఎన్నో పోషకవిలువలుంటాయి. ఇందులో కాల్షియంతో పాటుగా విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మోకాళ్ల నొప్పులున్న వారు వీటిని తరచుగా తింటే మంచిది.