బరువు తగ్గాలని రాత్రిపూట తినడం మానేసారా? మీకు ఆరోగాలు వచ్చుంటాయి పో ఇగ..

Published : Mar 07, 2022, 04:22 PM IST

Avoid Dinner:బరువు తగ్గే ప్రాసెస్ లో చాలా మంది కామన్ గా కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల బరువు తగ్గడం పక్కన పెడితే కొత్త సమస్యలు చుట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రాత్రిపూట డిన్నర్ చేయని వారికి ఖచ్చితంగా ఈ రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.   

PREV
18
బరువు తగ్గాలని రాత్రిపూట తినడం మానేసారా? మీకు ఆరోగాలు వచ్చుంటాయి పో ఇగ..
16:8 विधि

Avoid Dinner:ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాగా శరీర బరువును తగ్గించుకోవడానికి ప్రత్యేక డైట్ ను ఫాలో అయ్యే వారు చాలా మందే ఉన్నారు. వ్యాయామాలు చేయడం, ఫుడ్ ను తగ్గించి తినడం, యోగాలు చేయడం, లిక్విడ్ ఫుడ్ ను మాత్రమే తినడం వంటివి చేస్తుంటారు.

28

బరువు తగ్గించే ప్రయత్నంలో ఎక్కువ మంది ఫాలో అవుతున్న వెయిట్ లాస్ చిట్కా.. ఒక పూట మాత్రమే తినడం. అవును చాలా మంది వెయిట్ లాస్ కోసం రోజుకు ఒకసారి మాత్రమే అన్నం తింటున్నారు. పొద్దున్న ఏదో తిన్నామా అంటే తిన్నామనిపించి, మధ్యాహ్నం అన్నం తిని, రాత్రి పూట మాత్రం ఖాళీ కడుపుతో పడుకుంటున్నారు. 

38
weight loss

రాత్రి పూట భోజనం చేయకపోవడం వల్ల బరువు తగ్గుతామని చాలా మంది ఇలా ఖాళీ కడుపుతో పడుకుంటున్నారు. రాత్రిపూట తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బలహీనంగా కూడా మారిపోతారని చెబుతున్నారు. చాలా కాలం పాటు రాత్రుళ్లు తినకుండా పడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం పదండి..

48

ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఒక్క పూట తినకపోయినా మనం బలహీనంగా మారిపోతాం. ఎందుకంటే పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ కు, మధ్యాహ్నం భోజనానికి, నైట్ డిన్నర్ కు ఎంతో గ్యాప్ ఉంటుంది. అందువల్ల మీరు ఒక్క పూట తినకపోయినా చాలా బలహీనంగా మారుతారు. దీంతో మీరు తొందరగా అలసటకు గురవుతారు.

58

ముఖ్యంగా బరువు తగ్గాలని రాత్రుళ్లు భోజనం మానేస్తే మాత్రం మీ శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు అస్సలు అందవు. తద్వారా మీరు బలహీనంగా మారుతారు. 

68

వెయిట్ లాస్ అవ్వడం కోసం ప్రత్యేక డైట్ పాటించే వారు రాత్రుళ్లు తేలిక పాటి ఆహారాన్నైనా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఖాళీ కడుపుతో పడుకుంటే మీకు మరింత ఆకలి అయ్యే అవకాశం ఉండదు. దాంతో మీరు తొందరగా పడుకోలేరు. అంతేకాదు దీనివల్ల మీకు గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. దీంతో మీకు రాత్రుళ్లు నిద్ర అసలే ఉండదు. మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

78

వెయిట్ లాస్ అవ్వడం ఎంత అవసరమో, శరీరానికి కావాల్సిన పోశకాలను అందించడం కూడా అంతే అవసరం. రాత్రుళ్లు ఖాళీ కడుపుతో పడుకోవడం వల్ల మీ బాడీ కి అవసరమయ్యే పోషకాలు లభించవు.  దీంతో మీ ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది.  

88

తలతిరడం, రక్తహీనత, బలహీనత వంటి ఎన్ననో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు రాత్రుళ్లు పూర్తిగా తినడం మానేయకండి. కనీసం తేలికపాటి ఆహారాన్నైనా తినండి. అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

click me!

Recommended Stories