Telugu

Kitchen Hacks: కూరగాయలు వారం రోజులైనా తాజాగా ఉండాలా? ఈ ట్రిక్ మీకోసమే

Telugu

న్యూస్ పేపర్ ఉన్నా చాలు..

కూరగాయలను మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే కడగకూడదు. వాటిని పేపర్ టవల్ లేదా న్యూస్ పేపర్ పై ఆర పెట్టాలి. తర్వాత ఆ పేపర్ లోనే చుట్టాలి.

Image credits: our own
Telugu

5-7 రోజులు తాజాగా ఉంటాయి

ఇలా పేపర్‌లో చుట్టిన కూరగాయలను ఒక ఎయిర్‌టైట్ బాక్స్ లేదా జిప్-లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచండి. పేపర్ తేమను పీల్చుకుని, కూరగాయలను 5-7 రోజుల పాటు తాజాగా ఉంచుతుంది.

Image credits: Pexels
Telugu

కాటన్ క్లాత్ వాడకం

ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌లో కూరగాయలను వేసి, వదులుగా కట్టి ఫ్రిడ్జ్‌లోని వెజిటబుల్ బాక్స్‌లో పెట్టండి. కాటన్ క్లాత్ గాలి ప్రసరణకు సహాయపడుతుంది. కూరగాయలు కుళ్లిపోకుండా కాపాడుతుంది. 

Image credits: Freepik
Telugu

ఇది గుర్తుంచుకోండి

కూరగాయలను కడిగి ప్లాస్టిక్ కవర్‌లో అస్సలు పెట్టవద్దు. అలా చేస్తే అవి వెంటనే కుళ్లిపోతాయి.

Image credits: Getty
Telugu

కూరగాయలు పూర్తిగా పొడిగా ఉండాలి

ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందు కూరగాయలు పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోండి. టమాటా లేదా సొరకాయ వంటి ఎక్కువ నీటిశాతం ఉండే కూరగాయలతో కలిపి వీటిని నిల్వ చేయవద్దు.

Image credits: Getty

Oral Health: ఆరోగ్యమైన పళ్లు, చిగుళ్ల కోసం ఈ 7 విషయాలు తప్పక పాటించండి

ఏడాదంతా నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసా?

Compost Making: రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ!

Lunch: మధ్యాహ్న భోజనంలో పొరపాటున కూడా తినకూడనివి ఇవే