Wife Secrets: భర్త అంటే ఎంత ఇష్టమున్నా..భార్యలు ఈ విషయాలను మాత్రం వారికి చెప్పరట.. ఎందుకంటే?

Published : Jun 10, 2022, 01:02 PM IST

Wife Secrets: భార్యా భర్తల సంధం చాలా గొప్పది. పెళ్లైన నాటి నుంచి ఒకరి కోసం ఒకరుగా బతుకుతారు. అయితే భర్తలకు భార్యలు కొన్ని విషయాలను ప్రాణం పోయినా చెప్పరట. అవేంటంటే? 

PREV
16
Wife Secrets: భర్త అంటే ఎంత ఇష్టమున్నా..భార్యలు ఈ విషయాలను మాత్రం వారికి చెప్పరట.. ఎందుకంటే?


Wife Secrets:భార్యా భర్తల మధ్య సంబంధం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వివాహం అయినప్పటి నుంచి వారిద్దరు ఒకరి కోసం ఒకరుగానే జీవిస్తారు. వివాహ బంధం అన్నాక అప్పుడప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరగడం చాలా కామన్. కానీ ప్రేమ, నమ్మకం అనే మాధుర్యం తప్పకుండా ఉంటుంది. ఇది చాలు.. వారి బంధం కడవరకు వెళ్లడానికి. సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు. కానీ ఇప్పటికీ భార్యలు తమ భర్తలకు చెప్పడానికి సంకోచించే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంతకీ భార్యలు భర్తలకు ఎలాంటి విషయాలను చెప్పరో తెలుసుకుందాం పదండి. 
 

26

బంధుమిత్రులు, తమ పిల్లలకు సంబంధించిన విషయాలు: స్త్రీలు కూడా తమ బంధువుల గురించి ఏదో ఒక విషయంలో చాలా సార్లు ఆందోళన చెందుతుండటం ప్రతి ఒక్కరూ గమనించే ఉంటారు. కానీ వారు ఈ విషయాన్ని భర్తకు మాత్రం చెప్పరు. అదే సమయంలో కొన్నిసార్లు పిల్లల గురించి తీసుకునే కొన్ని నిర్ణయాల గురించి భర్తకు చెప్పరట.

36

సీక్రెట్ క్రష్: పెళ్లి  కాకముందు చాలా మంది మహిళలకు సీక్రేట్ క్రష్ ఉండే అవకాశం ఉంది. అయితే ఆమె అతని గురించి ఎవరికీ చెప్పదు. చాలాసార్లు ఆమె అతని గురించి తన స్నేహితులకు చెబుతుంది. కానీ తన భర్తకు మాత్రం అస్సలు చెప్పదట. 
 

46

పొదుపు: మహిళలే ఇంటి వ్యవహారాలను చూసుకునేది కాబట్టి.. వీరు అదనంగా పొదుపు చేయాలని భావిస్తారట. కానీ తాను పొదుపు చేసిన డబ్బు గురించి మాత్రం తన భర్తకు చెప్పదట. దీనికి కారణం.. ఏదైనా ఇబ్బందకర సమయం ఎదురైనప్పుడు లేదా ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఇలా చేస్తారు.
 

56

ఆఫీసు విషయాలు: ఆఫీసుల్లో పనిచేసే మహిళలు తమ ఆఫీసుకు సంబంధించిన విషయాలను భర్తలకు అస్సలు చెప్పరు. ఆఫీసులో ఏ పనిలోనైనా విజయం సాధించడం గురించి గానీ, ఆఫీసులో ఆమె అందుకున్న ప్రశంసల గురించి గానీ ఆమె తన భర్తకు చెప్పదు. అయితే దాని గురించి ఆమె తన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు చెబుతుంది.  ఎ౦దుక౦టే తమ భర్తలు తమక౦టే తక్కువగా భావించడం వారికి ఇష్టముండదు. 

66

శారీరక సమస్యలు: భార్యలు తమ భర్తల ఆరోగ్య సంబంధిత విషయాలను కూడా చెప్పరు. తన భర్తకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి వారు ఇలా చేస్తారట. దీనికి రె౦డవ కారణం.. దాని గురి౦చి తన భర్తకు చెప్పడానికి ఆమెకు సిగ్గుకలగడం.  ఉదాహరణకు ఆమె తన భర్తకు జననేంద్రియాలలో గడ్డలు ఉండటం గురించి చెప్పడానికి సంకోచిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories