బొప్పాయి పోషకాల గని. మనకు ఆరోగ్యం అందించడంలోనే కాదు.. సౌందర్య పోషణకూ బొప్పాయి చక్కగా ఉపయోగపడుతుంది. మొటిమలు, నల్ల మచ్చలు పోగొట్టి, ముఖం మెరిసేలా చేయడంలో బొప్పాయి ఆకుల్ని చాలా ఉపయోగపడతాయి. వీటిని ఎలా వాడాలో తెలుసుకుందాం.
బొప్పాయి రుచికరమైన, పోషకాలున్న పండు. బొప్పాయి పండులోనే కాదు, ఆకుల్లోనూ పోషకాలు ఉంటాయని తెలుసా?
బొప్పాయి ఆకులో విటమిన్ ఎ, విటమిన్ సి, పపైన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది. చర్మ సమస్యల నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది. బొప్పాయి ఆకులోని విటమిన్లు చర్మం రంగును మెరుగుపరుస్తాయి. బొప్పాయి ఆకును ముఖానికి వాడితే మొటిమలు, నల్ల మచ్చలు, గాయాల గుర్తులు తగ్గుతాయి. ముఖం మెరుస్తుంది. బొప్పాయి ఆకును ముఖానికి ఎలా వాడాలో తెలుసుకుందాం.
24
ముఖం మెరవాలంటే..
ముఖం మెరవాలంటే బొప్పాయి ఆకుల రసం ముఖానికి రాయాలి. రెండు మూడు ఆకులు తీసుకుని బాగా రుబ్బి రసం తీయాలి. ఆ రసాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
34
మొటిమలు, మచ్చలు పోవాలంటే..
బొప్పాయి ఆకుల్ని పేస్ట్ లా చేసి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే మొటిమలు, నల్ల మచ్చలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గి ముఖం మెరుస్తుంది. ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయి.
44
బొప్పాయి ఆకు ఫేస్ ప్యాక్:
బొప్పాయి ఆకు ఫేస్ ప్యాక్ కోసం రెండు మూడు ఆకులు రుబ్బి తీసుకోవాలి. దీనికి తేనె లేదా అలోవెరా జెల్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్ ను ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తే ముఖం మెరవడమే కాదు, మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి.