ఇదంతా విన్న కృష్ణుడు.. 'చూశావా దుర్యోధన నువ్వు మనుషుల్లో చెడు గుణాల్ని చూశావు కాబట్టి నీకు ఎవరు దొరకలేదు. అదే విధంగా ధర్మరాజు మనుషుల్లోని మంచి గుణాలు చూశాడు అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు, ప్రజలంతా ఆయనను కీర్తిస్తున్నారు. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా' అని చెప్తాడు. దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుంది.
నీతి: ప్రస్తుతం సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతోంది. ఎక్కడ చూసినా తప్పులను ఎంచే వారి ఎక్కువుతున్నారు. అందుకే పాజిటివ్ ఆటిట్యూడ్‌ను పెంచుకోవాలని చెబుతున్నారు. ప్రతీ మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దానిని గుర్తిస్తే మనలో కోపం, అసూయ అనే భావోద్వేగాలకు అసలు తావే ఉండదనే గొప్ప సందేశాన్ని ఈ కథ చెబుతోంది.