Recipes: రొటీన్ పులావ్ తిని బోర్ కొట్టిందా.. అయితే పాలకూర పులావ్ ట్రై చేద్దాం!

Navya G | Updated : Sep 21 2023, 12:45 PM IST
Google News Follow Us

 Recipes: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ దాని రుచి వలన చాలా మంది తినటానికి ఇష్టపడరు. కానీ అందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే ఈరోజు వెరైటీగా పాలకూరతో పులావ్ చేసుకుందాం.
 

16
 Recipes: రొటీన్ పులావ్ తిని బోర్ కొట్టిందా.. అయితే పాలకూర పులావ్ ట్రై చేద్దాం!

 పాలకూర వండాక వచ్చే వాసన చాలా మందికి నచ్చదు, ముఖ్యంగా పిల్లలకి. అందుకే పులావ్ రూపంలో చేసే పెడితే ఇష్టంగా తింటారు. ముందుగా దానికి కావలసిన పదార్థాలు పాలకూర తరుగు ఒక కప్పు, క్యారెట్ తరుగు పావు కప్పు, ఉల్లిపాయ తరుగు ఒకటి, పచ్చిమిరపకాయలు నాలుగు, టమోటా తరుగు అర కప్పు.

26

తమిళనాడు స్టైల్ లో చేసుకునే  ఖుస్కా పులావ్ నాన్ వెజ్ కూరలతో కానీ, ఏ కూర లేకున్నా రైతాతో కానీ తీసుకున్న భలే రుచిగా (Delicious) ఉంటుంది. దీన్ని ఎంతో సులభంగా కుక్కర్ లోనే తయారుచేసుకోవచ్చు.
 

36

 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, పులావ్ ఆకు రెండు, బియ్యం రెండు కప్పులు, నూనె తగినంత, నెయ్యి ఒక స్పూన్, దాల్చిన చెక్క ఒక ముక్క, యాలకులు రెండు,లవంగాలు రెండు, పసుపు ఒకటి స్పూన్, నీరు సరిపడినంత, బిర్యానీ మసాలా చిటికెడు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం.
 

Related Articles

46

పాలకూరని తరిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో పాలకూర తరుగు, ఉప్పు, పసుపు వేసి వేయించండి. ఆకుల్లోని నీరు దిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద పులావ్ వండుకునే గిన్నెని పెట్టుకోండి.
 

56

 తర్వాత పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేయండి. అవి కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు క్యారెట్ ముక్కలు వేయండి. పది నిమిషాల పాటు చిన్న మంటపై వేయించండి. ఇప్పుడు పాలకూర పేస్ట్ ని కూడా వేసి బాగా కలపండి.

66

 ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలిపి తగినంత నీళ్లు పోయండి. సగం ఉడికిన తర్వాత అన్నం పై నెయ్యి వేయండి. ఇప్పుడు పూర్తిగా ఉడికిన తర్వాత కళాయి స్టవ్ దింపేయండి ఇంకేముంది వేడివేడి పాలక్ పులావ్ రెడీ.

Recommended Photos