కానీ బరువు పెరగటం మాత్రమే ఆరోగ్యానికి హాని కలిగించదు. ఇలాంటి డీప్ ఫ్రైడ్ పొటాటోస్ తినడం వలన కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. బంగాళదుంపలను 120 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు ఏర్పడే రసాయనం మైక్రిలామైడ్. ఈ రసాయనాన్ని ఆరోగ్య శాస్త్రవేత్తలు చాలా కాలంగా క్యాన్సర్ కారకంగా పరిగణిస్తున్నారు.