పాలక్ పనీర్ అంటే ఇష్టమా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!

First Published Nov 28, 2022, 4:55 PM IST

బచ్చలికూర పనీర్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. కానీ ఈ పనీర్ కాంబినేషన్ వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

బచ్చలి పనీర్ ను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. ఈ పనీర్ ను చపాతీతో తింటే అబ్బా.. రుచి అదిరిపోతుంది. అందుకే చాలా మంది ఈ పనీర్ ను వారానికి రెండు మూడు సార్లైనా చేసుకుని తింటుంటారు. బచ్చలికూర, పనీర్ ఈ రెండూ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ బచ్చటికూరను పనీర్ ని కలిపి తినకూడదు. పనీర్ ను బచ్చలికూరతో కలిపి తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపిస్తుంది. బచ్చలికూరలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ పనీర్ ను తయారు చేస్తే ఐరన్ కంటెంట్ ఎలా తగ్గిపోతుందని మీరు ఆశ్చర్యపోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 
 

బచ్చలికూరను తినడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. కానీ బచ్చలికూర, పనీర్ ఒక ప్రమాదకరమైన కలయిక. పనీర్ బచ్చలికూరలో ఉండే పోషకాలను చంపుతుంది. ఈ కాంబినేషన్ లో పనీర్ తినడం వల్ల మన శరీరానికి ఇనుము, కాల్షియం అందుతాయి. అయితే మన శరీరం ఇనుమును శోషించుకోలేకపోతుంది. దీనివల్ల మన బచ్చలికూరలో ఉండే ఐరన్ శరీరం నుంచి బయటకు పోతుంది.
 

ఈ  పనీర్ తిన్నప్పుడు శరీరంలోకి వెళ్లే క్యాల్షియం ఐరన్ ను పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల శరీరానికి ఇనుము అందదు. దాంతో మీ శరీరంలో ఇనుము లోపం ఏర్పడుతుంది. బచ్చలికూర పనీర్ కు బదులుగా బచ్చలికూర-బంగాళాదుంప లేదా బచ్చలికూర -మొక్కజొన్నను తినొచ్చు. బచ్చలికూర పనీర్ ను తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మూత్రపిండాల్లో రాళ్లు

బచ్చలికూర పనీర్ ను తినడం వల్ల శరీరం ఇనుమును శోషించుకోలేకపోతుంది. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఒక అధ్యయనం ప్రకారం.. బచ్చలికూరలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది పనీర్ లో ఉండే కాల్షియం ఉపయోగించుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ కాల్షియం నేరుగా మూత్రపిండాలల్లోకి వెళుతుంది. అక్కడ పేరుకుపోతుంది. దీంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. 
 

బచ్చలి కూరను ఎక్కువగా తినడం మంచిది కాదు

బచ్చలికూర ఆరోగ్యానికి మంచిదే కానీ.. మరీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బచ్చలికూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, కిడ్నీ స్టోన్, కీళ్ల నొప్పులు, రక్తం చిక్కగా మారడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే బచ్చలికూరను ఎక్కువగా తినకూడదంటారు డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని బచ్చలికూరతో కలిపి తీసుకోకూడదు. పెరుగు, పాలు, టోఫు, పనీర్ లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. 

click me!