Weight loss: ఈ పండు తింటే తొందరగా బరువు తగ్గుతారు..

Published : Jun 04, 2022, 03:58 PM IST

Weight loss: బరువు తగ్గడానికి ఎన్నో పండ్లు ఉన్నప్పటికీ కొన్ని పండ్లు మాత్రమే తొందరగా బరువును తగ్గిస్తాయి. అందులో నారింజ (Orange) ఒకటి. ఈ పండును రెగ్యులర్ గా తింటే ఫాస్ట్ గా మీ బరువు తగ్గుతుంది. 

PREV
18
Weight loss: ఈ పండు తింటే తొందరగా బరువు తగ్గుతారు..

ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. చాలా మంది బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా బరువు తగ్గని వారు కూడా ఉన్నారు. అయితే కొన్ని రకాల పండ్లు కూడా సులువుగా బరువును తగ్గిస్తాయి. అందులో నారింజ పండు ఒకటి. నారింజ పండు బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇంతకి నారింజ పండు మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం పదండి. 
 

28

బీపీని అదుపులో ఉంచుతుంది.. నారింజ పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఓవర్ వెయిట్ ను తగ్గించడమే కాకుండా ఎన్నో వ్యాధులను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది అధిక రక్తపోటు (High blood pressure)ను కూడా అదుపులో ఉంచుతుంది. అంటే హై బీపీ సమస్య ఉన్నవాళ్లు ఈ పండును రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. 

38

రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది.. నిజానికి నారింజ పండును సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. ఈ నారింజ పండ్లు మన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడతాయి. 

48

ఎముకలు దృఢంగా ఉంటాయి.. బలహీనమైన ఎముకలు, అకాల ఎముకల నొప్పులు వంటి సమస్యలున్న వారు నారింజ పండ్లను రెగ్యులర్ గా తినడం అలవాటు చేసుకోవాలి. ఇది మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచుతుంది. అలాగే ఎముకలను బలంగా చేస్తుంది. 
 

58

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ఆరెంజ్ పండ్లు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. మాకు క్యాన్సర్ వస్తుందని భావించే వ్యక్తులు దీనిని ఖచ్చితంగా రోజూ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నారింజలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాల నుంచి బయటపడేస్తాయి. దీనిలో ఉండే బీటా కెరోటిన్, ఆస్కార్బిక్ క్యాన్సర్ తో పోరాడుతుంది. 
 

 

68

నారింజ పండ్లను తరచుగా తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తొందరగా తగ్గుతాయి. అంతేకాదు దీనిలో ఉండే విటమిన్ బి6 హిమోగ్లోబిన్ ఉత్పత్తికి  తోడ్పడుతుంది. 

78

ఈ పండు చెవి ఇన్ ఫెక్షన్లు, జలుబు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఇది చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీరు నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. 

88

నారింజ పండు కండ్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఏజ్ పెరుగుతున్న కొద్దీ వచ్చే కంటి సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories